హాస్యరసం ఒక ప్రత్యేకమైన గుణం కలిగినది. అది అందర్నీ నవ్విస్తుంది. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతుంది. తద్వారా ఆరోగ్యవంతుల్ని చేస్తుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. మనల్ని నవ్వించి, కవ్వించి మెప్పించిన హాస్యనటులు ఎందఱో చిత్రసీమలో కనిపిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైన శైలి. అందరిలోనూ పద్మనాభంగారిది ప్రత్యేకమైన శైలి.
మొద్దబ్బాయి పాత్ర మనకి చిరపరచితమైన పాత్ర. ఆ పాత్ర లక్షణాలను వంటపట్టించుకుని తనదైన శైలిని ఏర్పరుచుకున్నారు పద్మనాభం. బొద్దుగా ఉండే ఆకారంతో, ముద్దు ముద్దు మాటలతో, విలక్షణమైన పదాల విరుపుతో వెండితెర మీద హాస్యాన్ని పండించారు పద్మనాభం. ఆయన నటుడే కాదు గాయకుడు కూడా ! ముఖ్యంగా తెలుగువారికి ప్రత్యేకమైన పద్యాలను చక్కగా ఆలపించేవారు. అయితే ఆయన కేవలం హాస్యమే కాదు... అందులోనుంచి కరుణరసం కూడా అద్భుతంగా పలికించగలరని నిరూపించిన సందర్భాలు కూడా వున్నాయి.
హాస్యనాభుడు పద్మనాభం జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.......
పద్మనాభంగారి గురించి గతంలో రాసిన టపాలు............
విలక్షణ హాస్య నటుడు కన్నుమూత
హాస్యానికి కొత్త భాష్యం పద్మనాభం
హాస్యనాభం
ఆయన నటించిన ఈ పాట పద్మనాభం నటనలోని విభిన్న కోణానికి నిదర్శనం........
Vol. No. 03 Pub. No. 006
No comments:
Post a Comment