*
‘ శిరాకదంబం ’ అంతర్జాల పత్రిక ప్రస్థానం లో దశాబ్ద కాలం పూర్తి అయింది. పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్న రచయితలు, రచయిత్రులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనదారులకు, ఇంకా అనేక రూపాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న .... అందరికీ కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ.... 🙏 🙏 🙏
' దశ దిశోత్సవం ' పేరిట పదవ వార్షికోత్సవ సంచిక ను భవిష్యత్తు మార్పులకు సూచికగా రెండు భాగాలుగా రూపొందించడం జరిగింది. అందులో ఒకటి మామూలు పద్దతిలోని అక్షర రూపంలో అయితే మరొకటి దృశ్య శ్రవణ ( AV ) రూపంలో వెలువడింది.
ఇప్పటి వరకు ప్రతి నెల వెలువడుతున్న రెండు సంచికల్లో ఇకపైన ఒకటి అక్షర రూప సంచికగా, మరొకటి దృశ్య శ్రవణ సంచికగా వెలువడుతాయి. రచయితలు, పాఠకులు, ప్రకటన దారులు, శ్రేయోభిలాషులు గమనించ ప్రార్ధన. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ప్రసంగాలు, కథా కవితా పఠనాలు, శాస్త్రీయ... లలిత... జానపద... వంటి పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయం, నాటిక, నృత్యం వంటి ప్రదర్శనా కళలు, చిత్రలేఖనం, చేతి వృత్తులు, వంటలు వంటి ఏ అంశం మీదనైనా దృశ్య ( వీడియో ) లేదా శ్రవణ ( ఆడియో ) మాధ్యమాల ద్వారా పంపించవచ్చు. వివరాలకు editorsirakadambam@gmail.com గాని, editor@sirakadambam.com గాని సంప్రదించవచ్చు.
' దశ దిశోత్సవం ' ప్రత్యేక సంచిక..... ఈ క్రింది లింక్ లో.....
Vol. No. 13 Pub. No. 001
No comments:
Post a Comment