Tuesday, July 26, 2011

అయిదుగురు సంగీత దర్శకులు - జవాబు

కనుక్కోండి చూద్దాం - 47 _ జవాబులు




చాలా చిత్రాలకు జంట సంగీత దర్శకులు పనిచెయ్యడం, కొన్ని జంటలు ప్రజాదరణ పొందడం మనకి తెలుసు. హిందీలో శంకర జైకిషన్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇలా ...... దక్షిణాదిన విశ్వనాథన్ రామమూర్తి, రాజన్ నాగేంద్ర, తర్వాత కొంతకాలం రాజ్ కోటి, కృష్ణ చక్ర ఇలా ..... కొన్ని జంటలు ప్రాముఖ్యం చెందాయి. అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకశ్రోతలకు పంచాయి.

ఇటీవలి కాలంలో తక్కువ సమయంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించాలనో, మరే ఇతర కారణం చేతనో గానీ ఒకే చిత్రానికి నలుగురయిదుగురు దర్శకులు, సంగీత దర్శకుల చేత అక్కడక్కడా పనిచేయిస్తున్నారు గానీ, నిదానంగా అన్ని పనులకు తగినంత సమయం కేటాయించగలిగే కాలంలో ఒకే చిత్రానికి అయిదుగురు సంగీత దర్శకులు పనిచెయ్యడం అనే సంఘటన బహు అరుదు.

అలాంటి సంఘటన గతంలో ఒక తెలుగు చిత్రానికి జరిగింది. ఆ చిత్రం ఇటీవలే షష్టిపూర్తి చేసుకుంది.

) చిత్రం పేరేమిటి ?

జవాబు : వాలి సుగ్రీవ ( 1950 )


) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అయిదుగురు సంగీత దర్శకులు ఎవరు ?

జవాబు : గాలి పెంచల నరసింహరావు, యస్. రాజేశ్వరరావు, ఘంటసాల, పెండ్యాల, మాస్టర్ వేణు


అజ్ఞాత గారు, రాజీవ యామిజాల గారు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసారు. కానీ చిత్రం పాతాళ భైరవి కాదండీ ! అలాగే అజ్ఞాత గారు చెప్పిన వారిలో ఘంటసాల గారు మాత్రమే ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అయితే పాతాళభైరవితో బాటు వాలి సుగ్రీవ కూడా 1950 లో విడుదల అవడం వలన రెండు చిత్రాలూ షష్టిపూర్తి చేసుకున్నాయి.

ఈ ప్రశ్నలకు నూటికి నూరు శాతం సరైన సమాధానం చెప్పిన వారు దేవిక సాయి గణేష్ పురాణం గారు. వారికీ, రాజీవ గారికి, అజ్ఞాత గారికి ( మీరు పేరు రాసి వుంటే బాగుండేది ) ధన్యవాదాలు.


Vol. No. 02 Pub. No. 287

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం