కనుక్కోండి చూద్దాం - 45_ జవాబు
ఇదొక చిత్రం వర్కింగ్ స్టిల్. ఆ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నాయి.
ప్రత్యేకతలు : 1 ) అందరూ కొత్తవారితో ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు చేసిన ప్రయోగం.
2 ) తొలి తెలుగు సాంఘిక రంగుల చిత్రం
ఆ ) ఈ ఫోటోలో వున్న వారెవరు ?
జవాబు : ( ఎడమనుంచి ) కథానాయిక సుకన్య, కథానాయకుడు రామ్మోహన్, ఆ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసిన కళాతపస్వి కె. విశ్వనాథ్.
ఆ ) ఈ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది ?
జవాబు : తేనె మనసులు ( 1965 )
ఇక సమాధానాల విషయానికొస్తే చెప్పిన వారందరూ కలసి సరిగానే చెప్పారు. కానీ విడి విడిగా కొన్ని తప్పారు. జ్యోతి గారు రామ్మోహన్ ని గుర్తుపట్టి విశ్వనాథ్ గారిని గుర్తుపట్టలేకపోవడం విచిత్రమే ! ఇక కథానాయిక విషయంలో దేవిక సాయిగణేశ్ గారు, ఫేస్ బుక్ ' కళాపూర్ణోదయం ' గ్రూప్ లో భాస్కరభట్ల జనార్ధనశర్మ గారు మాత్రమే సరిగా చెప్పగలిగారు. మాలా కుమార్ గారు కథానాయకుడిని, చిత్రం పేరుని సరిగానే అనుమానించారు. అలాగే చిత్రం ప్రత్యేకతలు కూడా సరిగానే చెప్పారు. అలాగే వీటికి రాజేంద్రకుమార్ గారు విశ్వనాథ్ గారిని కూడా సరిగానే కలిపారు. ప్రసీద గారు కథానాయిక పేరు తప్ప మిగిలినవన్నీ సరిగానే చెప్పారు. దేవికా సాయిగణేశ్ గారు ముగ్గురి పేర్లు సరిగానే చెప్పినా చిత్రం పేరు మాత్రం తప్పు చెప్పారు. ఫేస్ బుక్ లో జనార్ధన శర్మ గారు కూడా కథానాయిక, కథానాయకుడి పేర్లు సరిగానే చెప్పినా చిత్రం పేరు తప్పు చెప్పారు. విశ్వనాథ్ గారిని ఆయన కూడా గుర్తించలేదు.
మొత్తానికి ఇందులో పాల్గొని సమాధానాలు చెప్పిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
Vol. No. 02 Pub. No. 278a
No comments:
Post a Comment