Tuesday, July 12, 2011

గాడిద బరువు


రావు బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయిడు గారు  కందుకూరి వీరేశలింగం గారి శిష్యులు. ఆయనలాగే నాయుడు గారు కూడా సంఘసంస్కరణాభిలాషి.

అంతరానితన నిర్మూలనకు కృషి చేసి కాకినాడలో అనాధలైన హరిజన బాలబాలికలకు ఆశ్రమం కట్టించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు, కులాంతర వివాహాలకు, విధవా పునర్వివాహాలకు కృషి చేశారు. బ్రహ్మ సమాజ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ' బ్రహ్మర్షి ' బిరుదు పొందారు.


ఆయన అధ్యాపకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. సికిందరాబాదు మెహబూబ్ కళాశాలకు, కాకినాడ పిఠాపురం రాజా కళాశాలకు ప్రధానాచార్యులుగా పనిచేశారు. అంతకుముందు ఆయన స్వస్థలం మచిలీపట్నంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న కాలంలో జరిగిన ఓ సంఘటన ఆయనలోని హాస్య చతురతకు నిదర్శనం.

ఓ రోజు కళాశాలనుండి ఇంటికి వెడుతూ విద్యార్థుల కాంపొజిషన్ పుస్తకాలు దిద్దడానికి తీసుకెడుతున్నారు. ఆ దారిలోనే వెడుతున్న విద్యార్థుల గుంపులోనుంచి ఓ  కొంటె విద్యార్థి

" మాస్టారూ ! గాడిద బరువు మోసుకెడుతున్నారు పాపం. ఎక్కడికి ? " అనడిగాడు.

దానికి నాయుడు గారు వెంటనే తడుముకోకుండా
" ఒక గాడిద బరువు కాదురా నేను మోస్తున్నది. నలభై గాడిదల బరువురా ! "
అనగానే తన మాట తనకే తగిలిన ఆ విద్యార్థి తోక ముడిచాడు.

Vol. No. 02 Pub. No. 277

3 comments:

Anonymous said...

రామచంద్రరావుగారూ, మీరు ఈ బ్లాగులో పెట్టిన ఆపాత మధురాలను ఆ బుల్లి స్క్రీన్ మీద మాత్రమే చూడగలుగుతున్నాము. స్క్రీన్ ను పెద్దది చేయడానికి వీలవుతుందా?

ఆ.సౌమ్య said...

హహహ...బలే చెప్పారు!

SRRao said...

* Anonymous గారూ !
ధన్యవాదాలు. పెద్ద సైజ్ లో చూడాలంటే Get Tracks అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఆ ప్లే లిస్ట్ తయారుచేసిన mixpod సైట్ తెరుచుకుంటుంది. అక్కడ చూడవచ్చు. ఫుల్ స్క్రీన్ కావాలంటే మీరు చూడాలనుకున్న పాటలో youtube బటన్ నొక్కితే ఆ పాట చూడవచ్చు.

* ఆ. సౌమ్య గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం