Friday, July 29, 2011
భళారే ' సినారె '
పౌర్ణమి నాడు పుట్టినవాళ్ళు కవులవుతారని ఒక వాదన వుంది. ఆది నిజమేనేమో ! ఎందుకంటే 1931 వ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ రోజున మనకో కవి లభించాడు. తన పద్నాలుగవ ఏటనే కవిత్వం రాయడం ఆరంభించిన ఆయనే డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి...... తెలుగువారు ముద్దుగా పిలుచుకునే సినారె.
సినారె కవిత ఎంత తీయగా వుంటుందో
సినారె గళం కూడా అంత మధురంగా వుంటుంది
ఆయన కవితా కులాలంకారుడు ...ద్విభాషా ప్రవీణుడు
తెలుగుతో బాటు ఉర్దూ కవిత్వాన్నికూడా ఔపోశన పట్టారు
సాంప్రదాయ ధోరణిలో పద్యాలు రాసారు
ఆధునిక ధోరణిలో వచన కవితలల్లారు
లలితమైన పదాలతో గేయాలు రాసారు
తెలుగులో అందమైన గజళ్ళు పాడారు
ప్రణయ గీతాలు... ప్రబోధ గీతాలు...
భావ గీతాలు.... భావోద్వేగ గీతాలు...
.... ఇలా ఎన్నో... ఎన్నెన్నో ఆణిముత్యాలు తెలుగువారికి అందించారు
.... తెలుగు కళామతల్లి కంఠహారంలో కవితా కుసుమాలు పొదిగారు
ఋతుచక్రం తిప్పి కర్పూర వసంతరాయలు ను పిలిచారు
విశ్వంభర డయి ప్రపంచ పదులు చెప్పి గదిలో సముద్రం పారించారు
ఆయనది అలుపెరగని సాహితీ వ్యవసాయం
అందుకే అత్యున్నతమైన జ్ఞానపీఠమెక్కారు
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నుండి జేజమ్మా వరకూ
సినారే సినీ గీతాలు కూడా సాహిత్య పరిమళాలు వెదజల్లాయి
తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోగలిగిన కవి సినారె
ఆ తరానికి, ఈ తరానికి మధ్య వారధిగా నిలిచిన సినారె.... నిజంగా భళారే !!
ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.........
సినారె గారి కలమే కాదు... గళం కూడా మధురమే ! ఆయనకు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించిన ' విశ్వంభర ' నుంచి, సున్నితమైన వ్యంగ్యాన్ని కలబోసిన ' ప్రపంచ పదులు ' నుంచి సినారే తన స్వంత గళంలో అందించిన కొన్ని కవితా కుసుమాలు.......
గతంలోని టపా.....
సినారె మాటల చమక్కులు
Vol. No. 02 Pub. No. 294
లేబుళ్లు:
శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
నైస్ పోస్ట్ సర్ .. రెడ్డి గారి కవితలు ఆయన గొంతులో వినిపించినందుకు కృతజ్ఞతలు..
నేను అయన అభిమానిని ..ఆయన తొలి పాట అయిన "నన్ను దోచుకొందువటే" పాటంటే నాకెంతో ఇష్టం..
తొలి పాటతోనే తన సత్తా ఏంటో చూపారు ..
ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని,
మరెన్నో మంచి మంచి పాటలు అయన కలం నుండి రావాలని కోరుకుంటున్నాను
పల్లవి గారూ !
ధన్యవాదాలు.
Post a Comment