బ్రిటిష్ గుండెల్లో మ్రోగించెను రణభేరీ
దుర్మార్గపు దురాక్రమణపై సంధించెను మిరపకాయ టపా
విద్రోహుల పన్నాగాలను కావించెను మెరుపుదాడితో సఫా
విప్లవ మార్గానికి నిలిచాడు మార్గదర్శిగా
అమరుడయ్యాడు భరతమాత ఋణం తీర్చగా !
విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జన్మదినం సందర్భంగా నివాళులు
భరతమాత నుదుట తిలకం వెంకయ్య
భరతజాతికే గర్వకారణమైన పదహారణాలా తెలుగు బిడ్డయ్యా !
దేశానికి అందించాడు మువ్వన్నెల జెండా
నిలిచిపోయాడు ప్రతిభారతీయుని గుండె నిండా
అందుకొన్నాడు గాంధీ వంటి మహాత్ముల ప్రశంసలు
తీర్చుకున్నాడు జన్మనిచ్చిన భరతమాత ఋణం
భరతమాత నుదుట మువ్వన్నెల తిలకం దిద్దిన పింగళి వెంకయ్య గారి వర్థంతి సందర్భంగా నివాళులు
Vol. No. 02 Pub. No. 271


No comments:
Post a Comment