కనుక్కోండి చూద్దాం - 47
చాలా చిత్రాలకు జంట సంగీత దర్శకులు పనిచెయ్యడం, కొన్ని జంటలు ప్రజాదరణ పొందడం మనకి తెలుసు. హిందీలో శంకర జైకిషన్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇలా ...... దక్షిణాదిన విశ్వనాథన్ రామమూర్తి, రాజన్ నాగేంద్ర, తర్వాత కొంతకాలం రాజ్ కోటి, కృష్ణ చక్ర ఇలా ..... కొన్ని జంటలు ప్రాముఖ్యం చెందాయి. అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకశ్రోతలకు పంచాయి.
ఇటీవలి కాలంలో తక్కువ సమయంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించాలనో, మరే ఇతర కారణం చేతనో గానీ ఒకే చిత్రానికి నలుగురయిదుగురు దర్శకులు, సంగీత దర్శకుల చేత అక్కడక్కడా పనిచేయిస్తున్నారు గానీ, నిదానంగా అన్ని పనులకు తగినంత సమయం కేటాయించగలిగే కాలంలో ఒకే చిత్రానికి అయిదుగురు సంగీత దర్శకులు పనిచెయ్యడం అనే సంఘటన బహు అరుదు.
అలాంటి సంఘటన గతంలో ఒక తెలుగు చిత్రానికి జరిగింది. ఆ చిత్రం ఇటీవలే షష్టిపూర్తి చేసుకుంది.
అ ) ఆ చిత్రం పేరేమిటి ?
ఆ ) ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అయిదుగురు సంగీత దర్శకులు ఎవరు ?
Vol. No. 02 Pub. No. 287
4 comments:
paataalabhiravi.
Paataala bhairavi music directors ghantasaala, puhalendi,pendyala, s.rajeshwar rao, aadinaraayan rao anukuntaanandi.
వాలి సుగ్రీవ సినిమా. ఇది 1950 లొ విడుదల అయ్యింది.
సంగీత దర్శకులు : ఘంటసాల, మాస్టర్ వేణు, యస్. రాజేశ్వరరావు,పెండ్యాల నాగేశ్వరరావు, గాలి పెంచల నరసింహరావు
సినిమా పేరు పాతాళ భైరవి
Post a Comment