Wednesday, July 27, 2011

' చిత్ర ' మయమైన పాట


అదొక ' చిత్ర ' మైన గళం
ఆ గళం అనేక విన్యాసాలు చేస్తుంది
ఆ గళం కొత్త పోకడలు పోతుంది
ఆ గళం స్వరలహరిలో తేలియాడుతుంది

ఆ గళమే ఈ తరం మధుర గాయని చిత్ర. 1963 లో తిరువనంతపురం లో జన్మించిన ఈ దక్షిణ భారత గాన కోకిల నిండారా నవ్వుతూ, మనసారా పాడుతూ మనందర్నీ మూడు దశాబ్దాలకు పైగా అలరిస్తోంది.
పాడుతూ ఎదిగిన చిత్ర ఎక్కని శిఖరం లేదు. అయినా ఎదిగిన కొద్దీ ఒదిగి వుండే సంస్కారం ఆమెది. ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి సుమారు 11000 సినిమా పాటలు, 4000 ప్రైవేటు ఆల్బంలు పాడిన చిత్ర గాన మాధుర్య ప్రవాహం ఇంకా కొనసాగుతోంది..... ఇంకా కొనసాగాలి......

దక్షిణ భారత గానకోకిల చిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ...........

పాడలేను పల్లవైనా... అంటూ తెలుగులో అడుగుపెట్టిన తొలిరోజుల్లో పాడిన చిత్ర గారి పాట....




Vol. No. 02 Pub. No. 290

2 comments:

ఇందు said...

Happy birthday to Chitra :)

SRRao said...

ఇందు గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం