Saturday, July 23, 2011

ప్రధానోపాథ్యాయుడి అర్హత



ఓసారి ప్రధానోపాధ్యాయుల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మునిమాణిక్యం నరసింహరావు గారు కూడా ఆ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అప్పటికే ఆయన రచయితగా లబ్ద ప్రతిష్టులు.

ఆయన పేరు ప్రఖ్యాతులు విన్న ఆ ఇంటర్వ్యూ కమిటీ అథ్యక్షులు మునిమాణిక్యం గారిని ' మీరు రచయిత కదా ? ' అని అడిగారు తన సందేహం తీర్చుకోవడానికి. అవునన్నారు మునిమాణిక్యం గారు.

" నవలలు రాసుకునే మీరు మాస్టారు పనేమి చెయ్యగలరు ? అందుకని ఈ పనికి మీరు తగరు " అన్నాడాయన.

వెంటనే మునిమాణిక్యం నరసింహారావు గారు తన సహజ హాస్య ధోరణిలో " అందుకే కదా.... ప్రధానోపాథ్యాయుడి ఉద్యోగం కోసం వచ్చిందీ ! " అన్నారట. అంతే !.... ఆ ఉద్యోగం ఆయనకే వచ్చింది.

Vol. No. 02 Pub. No. 286

3 comments:

Lakshmisarma Av said...

that was realy great humour , thanks sir for nice posting

కెక్యూబ్ వర్మ said...

good reply from a great person...thanks for sharing this sir..

SRRao said...

* లక్ష్మి గారూ !

* కేక్యూబ్ వర్మ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం