Tuesday, July 12, 2011
గాడిద బరువు
రావు బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయిడు గారు కందుకూరి వీరేశలింగం గారి శిష్యులు. ఆయనలాగే నాయుడు గారు కూడా సంఘసంస్కరణాభిలాషి.
అంతరానితన నిర్మూలనకు కృషి చేసి కాకినాడలో అనాధలైన హరిజన బాలబాలికలకు ఆశ్రమం కట్టించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు, కులాంతర వివాహాలకు, విధవా పునర్వివాహాలకు కృషి చేశారు. బ్రహ్మ సమాజ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ' బ్రహ్మర్షి ' బిరుదు పొందారు.
ఆయన అధ్యాపకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. సికిందరాబాదు మెహబూబ్ కళాశాలకు, కాకినాడ పిఠాపురం రాజా కళాశాలకు ప్రధానాచార్యులుగా పనిచేశారు. అంతకుముందు ఆయన స్వస్థలం మచిలీపట్నంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న కాలంలో జరిగిన ఓ సంఘటన ఆయనలోని హాస్య చతురతకు నిదర్శనం.
ఓ రోజు కళాశాలనుండి ఇంటికి వెడుతూ విద్యార్థుల కాంపొజిషన్ పుస్తకాలు దిద్దడానికి తీసుకెడుతున్నారు. ఆ దారిలోనే వెడుతున్న విద్యార్థుల గుంపులోనుంచి ఓ కొంటె విద్యార్థి
" మాస్టారూ ! గాడిద బరువు మోసుకెడుతున్నారు పాపం. ఎక్కడికి ? " అనడిగాడు.
దానికి నాయుడు గారు వెంటనే తడుముకోకుండా
" ఒక గాడిద బరువు కాదురా నేను మోస్తున్నది. నలభై గాడిదల బరువురా ! "
అనగానే తన మాట తనకే తగిలిన ఆ విద్యార్థి తోక ముడిచాడు.
Vol. No. 02 Pub. No. 277
లేబుళ్లు:
ఛలోక్తులు,
ప్రముఖుల విశేషాలు
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
3 comments:
రామచంద్రరావుగారూ, మీరు ఈ బ్లాగులో పెట్టిన ఆపాత మధురాలను ఆ బుల్లి స్క్రీన్ మీద మాత్రమే చూడగలుగుతున్నాము. స్క్రీన్ ను పెద్దది చేయడానికి వీలవుతుందా?
హహహ...బలే చెప్పారు!
* Anonymous గారూ !
ధన్యవాదాలు. పెద్ద సైజ్ లో చూడాలంటే Get Tracks అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఆ ప్లే లిస్ట్ తయారుచేసిన mixpod సైట్ తెరుచుకుంటుంది. అక్కడ చూడవచ్చు. ఫుల్ స్క్రీన్ కావాలంటే మీరు చూడాలనుకున్న పాటలో youtube బటన్ నొక్కితే ఆ పాట చూడవచ్చు.
* ఆ. సౌమ్య గారూ !
ధన్యవాదాలు
Post a Comment