కనుక్కోండి చూద్దాం - 54 _జవాబు
సంస్కృతంలో వాడుకలో వున్న ఈ భ్రమర కీట న్యాయం అనేదాన్ని మనం కూడా వాడుతూ వుంటాం.
ప్రశ్న : దీని అర్థమేమిటో, ఏ సందర్భంలో వాడుతామో చెప్పగలరా ?
జవాబు : భ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు.
పురుగు చుట్టూ తుమ్మెద తిరుగుతుంది. కొంతకాలానికి ఆ పురుగే తుమ్మెదగా మారుతుంది.
అయితే కనబడిన ప్రతి పురుగు చుట్టూ తుమ్మెద తిరగదు. అలాగే తుమ్మెద తిరిగిన ప్రతీ పురుగు తుమ్మెదగా మారదు.
తుమ్మెద ఎలా అయితే తనక్కావాల్సిన పురుగును వెదుక్కుని దాని చుట్టూ పరిభ్రమించి తనలాగే మార్చేస్తుందో అలాగే మనం కూడా మనక్కావలసిన వ్యక్తిని ఎంచుకుని విద్యాబుద్ధులు లాంటివి చెప్పించి మనంతటి వాడిని చెయ్యాలని ప్రయత్నిస్తాం.
దీనినే భ్రమర కీట న్యాయం అన్నారు పెద్దలు. తండ్రి కొడుకుల సంబంధం, గురుశిష్య సంబంధం ఇలాంటివే !
స్పందన : ముందుగా వెంటనే స్పందించిన జ్యోతి గారికి ధన్యవాదాలు. దాదాపుగా సరైన వివరణ ఇచ్చిన పందిళ్ళ శేఖర్ బాబు గారికి కూడా ధన్యవాదాలు.
Vol. No. 03 Pub. No. 051a
1 comment:
కేవలం వాటి రొద మాత్రం చేత మరొక తుమ్మెద ని సృష్టించే శక్తి ఉందంటే....అది భ్రమరాంబికం అన్నమాట :-)
Post a Comment