Saturday, October 15, 2011

పేర్ల తికమక... ? - జవాబులు


  కనుక్కోండి చూద్దాం - 55_ జవాబులు  


1939  లో వాహినీ వారు నిర్మించిన ' వందేమాతరం ' చిత్రంలో ప్రధాన కథాంశం నిజానికి స్వాతంత్ర్యోద్యమం కాదు. నిరుద్యోగ సమస్య.  అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరు చూసి నిషేదిస్తుందేమోననే సందేహంతో ఇంకో పేరు కూడా పెట్టారు. అసలు పేరు ' వందేమాతరం ' క్రిందనే చిన్న అక్షరాలలో ఉపశీర్షికగా ఆ పేరు వేసేవారు.
రాజకీయవేత్తగా, కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పని చేసిన ఒకప్పటి కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు 1944 లో ప్రారంభించిన ఒక చిత్రానికి అదే పేరు పెట్టారు. అంతే కాదు ఆ చిత్రానికి మొదట వేరే పేరు ప్రకటించి, ప్రొడక్షన్ దశలోనే ఇంకో పేరు మార్చి, చివరికి అది పూర్తయి విడుదల చేసే ముందు ఈ పేరు ఖరారు చేసారు.

అ ) 1939 లో ఉపశీర్షికగా, 1946 లో ప్రథాన శీర్షికగా వచ్చిన ఆ పేరు ఏమిటి ? 
జవాబు : మంగళసూత్రం  

ఆ ) 1946  లో వచ్చిన చిత్రం మొదటి రెండు పేర్లు ఏమిటి ? 
 జవాబు : మొదటి పేరు ' ఇది మా కథ ', తర్వాత పేరు ' మనమిద్దరం '  

ఇ ) 1946 లో వచ్చిన ఆ కథానాయకుడు, నిర్మాత, గవర్నర్ ఎవరు ? 
జవాబు : కోన ప్రభాకరరావు - ఈయన రాజకీయాలలో అనేక పదవులనలంకరించడంతో బాటు పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసారు.   
 
దేవికగారు దాదాపుగా అంతా సరిగానే చెప్పారు. ముఖ్యంగా ఆవిడ పరిజ్ఞానానికి ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు ' మంగళసూత్రం ' చిత్రం విడుదలైంది 1946  లోనే ! కాకపోతే ఆ చిత్రనిర్మాణ సన్నాహాలు ప్రభాకరరావు గారు 1944  లో ప్రారంభించారు. ఆ విషయమే వివరణలో ఇచ్చినా ప్రశ్నలలో మార్చకపోవడం పొరబాటు అయింది. జవాబులో సవరించాను. మీ సవరణకు ధన్యవాదాలు. 
 
రమణారావు గారు చెప్పినట్లు ప్రభాకరరావు గారు 1948  లో వచ్చిన ' ద్రోహి ' చిత్రంలో విలన్ గా నటించారు. అంతేకాదు.. 1951  లో విడుదలయిన ' రూపవతి ' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రమణారావు గారికి కూడా ధన్యవాదాలు.


Vol. No. 03 Pub. No. 057a

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం