ఒక కళాఖండం తయారవాలంటే ఎంతో మంది కృషి కావాలి. అన్ని కళారూపాల్నీ తనలో ఇముడ్చుకుని, సాంకేతికాంశాలను కూడా కలుపుకుని సరికొత్త కళగా రూపుదిద్దుకుంది సినిమా. ఈ ఆధునిక కళా రూపం ప్రజలకు ఇంత చేరువవడానికి వెనుక అసలు రహస్యం ఇదే !
సాధారణంగా తెర మీద కనిపించే నటీనటుల్ని ఎక్కువగా అబిమానిస్తారు ప్రేక్షకులు. వారి ప్రతిభ మనల్ని అలరించడం వెనుక ఎందఱో కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషి వుంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే అది ఉత్తమ కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది.
మన తెలుగు చిత్రసీమకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన చిత్రాల్లో మొదటగా చెప్పుకోదగ్గవి విజయా వారి చిత్రాలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఆ సంస్థలో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ దక్కుతుంది.
విజయా సంస్థలో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అనేక సెట్స్ రూపకల్పనకు, ముఖ్యంగా విదేశీ సాంకేతిక నిపుణులను సైతం అబ్బురపరచిన విజయావారి చందమామ రూపకల్పనకు కారణమైన కళాదర్శక జంట మాధవపెద్ది గోఖలే, కళాధర్.
ఈ జంటలో ఒకరైన కళాధర్ గారి 97 వ జన్మదినోత్సవం ఈరోజు.. ఆ సజీవ కళామూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వివరాలతో గతంలో రాసిన టపా, వారిపై రూపొందించిన కళాచిత్రం ఈ క్రింది లింకులో .......
Vol. No. 03 Pub. No. 046
No comments:
Post a Comment