కనుక్కోండి చూద్దాం - 51_జవాబు
జవాబు : ధీరేంద్రనాథ్ గంగూలీ
ఆ ) ఆయన ప్రధానంగా ఏ భాషలో చిత్రాలు నిర్మించారు ?
జవాబు : బెంగాలి, హిందీ
ధీరేంద్రనాథ్ గంగూలీ శాంతినికేతన్ విద్యార్ధి. ఆయన నటుడు, దర్శకుడు, నిర్మాత. బెంగాలీలో చిత్రాలు నిర్మించారు. 1921 నుంచీ ఆయన చిత్రాల్లో నటించారు. దాదాసాహెబ్ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ నైజాం స్టేట్ ఆర్ట్ స్కూల్లో ప్రథానోపాధ్యాయునిగా పనిచేసారు. నిజం సహకారంతో లోటస్ ఫిలిం కంపెనీ నెలకొల్పి బిమాత, చింతామణి లాంటి చిత్రాలు నిర్మించారు. ఆ పేరుతోనే ఒక స్టూడియో, రెండు థియేటర్లు స్థాపించారు.
1924 లో ధీరేంద్ర రజియా బేగం చిత్రం పంపిణీ చెయ్యడం నిజాం నవాబుకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఆయన హైదరాబాద్ ను వదలి వెళ్ళాల్సివచ్చింది. కలకత్తా చేరుకున్నాక ఆయన చాలా చిత్రాలు రూపొందించారు. పద్మభూషణ్ తో బాటు అనేక పురస్కారాలు అందుకున్నారు.
Vol. No. 03 Pub. No. 011a
No comments:
Post a Comment