షించునప్డు విన్పించు భాష
విష్పష్టముగ విన్పించునట్లు స్ప
ష్టోచ్చారణంబున నొనరు భాష
రసభావముల సమర్పణ శక్తి యందున
నమర భాషకు దీటైన భాష
జీవులలోనున్న చేవ యంతయు చమ
త్కృతి పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువుచూచి
భాషయననిద్దియని చెప్పబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చిచూపించినట్టిది తెలుగు భాష
వృత్తులు పాకముల్ రీతులు శైలులు
లావణ్య మొప్పెడు లలిత భాష
ఎద్ది సంభవమౌనొ అద్ది సంధానించి
ఉచితత్వమున్ గూర్త నొదుగు భాష
ఎన్నియొయ్యారంబులేని పోనగజేసి
నడిపింపగలయట్టి గడుసు భాష
పాలించి దక్షిణాపథమెల్ల నొకనాడు
ప్రభుత నిరూపించు రాజభాష
అల్ల భాషయొక్క నధికత్వమంతయు
శక్తి నెరపగలుగు జనుల మీద
అన్ని కాలములను నాధారపడియుండు
తెలుగు భాషయన్న దివ్యభాష ....... తెలుగు భాష సొగసు గురించి ఇంత బాగా చెప్పగలవారెవరు ?
తెలుగుభారతి ముద్దు బిడ్డ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కన్నా...
రామాయణ కల్పవృక్షాన్ని తెలుగు భారతి పెరట్లో నాటిన మహాకవి విశ్వనాథ
కిన్నెరసానికి నడకలు నేర్పి ఆంధ్ర దేశమంతా పారించిన మధురకవి విశ్వనాథ
నవలా సాహిత్యాన్ని వేయి పడగలతో అలంకరించిన సవ్యసాచి విశ్వనాథ
ప్రబంధం, కథ, కవిత, గేయం, విమర్శ.... అన్నీ ఆయనకు నల్లేరు మీద నడక
ఆధునిక యుగంలో శ్రీనాథునితో పోల్చగలిగిన గొప్ప కవి ఎవరు విశ్వనాథ కాక
విశ్వనాథవారు ఆథునికులలో ప్రాచీనుడు.... ప్రాచీనులలో అథునికుడు
ఆయన తెలుగు కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేసిన జ్ఞానపీఠాలంకృతుడు
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి జయంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తూ.........
Vol. No. 03 Pub. No. 030
3 comments:
sira garu..Viswanadha varu nijam gaane Telugu talli muddu bidda. Kinnerasani naaku chala istamaina rachana. vaari gurinchi meeru rayatam..daanni chadavagalagatam...! Dhanya vadalu...:)
చక్కటి నివాళి.
ఆయన ఆధునికుల్లో కూడా ఆధునికుడే.
ఆయన రచనల్ని భక్తులూ శత్రువులూ కూడా సరిగ్గా అర్ధం చేసుకోలేదు.
* గోమతి గారూ !
ధన్యవాదాలు
* కొత్తపాళీ గారూ !
మీరన్నది నిజం. కొంతమంది కొన్ని చట్రాల్లో బిగుసుకుపోతారు. అందుకే ఆయనను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ధన్యవాదాలు.
Post a Comment