Wednesday, September 28, 2011

మధురగానం


గంధర్వులు చేసే గానం అమృతమయమైనది అని ప్రతీతి.
నిజానికి అది మానవ మాత్రులకు అలభ్యం.
కానీ భారత దేశం చేసుకున్న అదృష్టం ఏమిటో గానీ ఎన్నో రకాల సంగీత రీతులు, ఎందరో మధుర గాయకులు. ఈ కర్మభూమిలో సాక్షాత్తూ ఆ గంధర్వులే దిగివచ్చి గానామృతాన్ని మనకందిస్తున్నారా అనిపిస్తుంది.
అలాంటి గంధర్వ గానామృతమే లతా మంగేష్కర్.

భారతదేశం చేసుకున్న అదృష్టం లతా  !
లలిత మనోహరమైన సుమధుర గానం లతది !
కోకిల గానం చెయ్యడానికి సందేహిస్తుంది లత గానం ముందు....

సెలయేళ్ల చిరు సవ్వడి ఆమె గొంతులో
చిన్ని లేళ్ళ చిరు నడకలు ఆమె గానంలో
గంధర్వులు మోకరిల్లుతారు ఆమె గానం ముందు..... 


సంగీత సరస్వతి ఆమెనావహించింది
అంతులేని స్వరగంగ ప్రవహించింది
దివ్యలోకాల సంచారం చేయిస్తుంది ఆమె గానం....

మధురగాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ......

నిదురపోరా తమ్ముడా.... అంటూ తెలుగులో తొలిసారిగా లతా మంగేష్కర్ పాడిన ఈ పాట ' సంతానం ' చిత్రంలోనిది.



Vol. No. 03 Pub. No. 043

2 comments:

శ్యామలీయం said...

నిస్సందేహంగా లత చాలా మంచి గాయని. కాని ఆమెకు లభించిన కీర్తికి అతి పెద్దకారణం ఆమె హిందీ భాషాచిత్రాలకు పాడటమే. భారతరత్న బిరుదం కూడా లభించడానికి అది చాలా దోహదం చేసింది.

ఆమె కన్నా యేమాత్రం తీసిపోని మహాగాయని సుశీలకు అటువంటి అత్యున్నత పురస్కారం లభించకపోవడానికి కారణం ఆమె తెలుగు తమిళాది భాషల గాయని కావడమే. పాపం ప్రాంతీయ లేదా దాక్షిణాత్యభాషా గాయనిగా అమె తక్కువ తరగతి గాయనిగానే మిగిలి పోవలసి వచ్చింది.

విచారించవలసిన మాట యేమిటంటే మన తెలుగు వారిలో కూడా చాలా మందికి సుశీల ఆనదు. వారికి కూడా లతాయే ఆరాధ్యగాయని!

శ్యామలరావు.

SRRao said...

శ్యామలరావు గారూ !

నిజమేనండీ ! కాకపోతే హిందీ దాక్షిణాత్యులకు కూడా పరిచితమే ! కానీ మన భాషలు మనవరకే పరిమితమవడం వల్ల ఈ పరిస్తితి. సుశీలగారికి నేను కూడా అబిమానినే ! ఆవిడ పాట నచ్చని దాక్షిణాత్యులు వుండరేమో ! ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం