ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదు అన్న విషయం ఆంధ్రులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఆయనకు లబించిన బిరుదమది. ఆయనకు ఆంధ్రులలో ఎంత పేరున్నా రాష్ట్ర స్థాయిని దాటి కేంద్ర స్థాయికి చేరుకోలేకపోయారు.
కట్టమంచి రామలింగారెడ్డిగారు సి. ఆర్. రెడ్డి గా ప్రసిద్ధులు. ఆయన విద్యావేత్త, కవి, విమర్శకుడు...మీదు మిక్కిలి సంభాషణా చతురుడు. ఆయన వ్యంగ్య బాణాలు విసరడంలో దిట్ట. ఆయన నోటివెంట శ్లేషలు అలవోకగా పలుకుతాయి.
ఓసారి రెడ్డిగారు ప్రకాశం గారిని గురించి మాట్లాడుతూ ఆయన బిరుదును విరిచి ఆంధ్ర ' కే ' సరి అని అన్నారట.
Vol. No. 03 Pub. No. 033
No comments:
Post a Comment