Wednesday, May 19, 2010

ప్రకృతికి ప్రశ్నలు

 మొన్న క్రోధంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణవేణమ్మ
విరుచుకుపడింది తన ప్రవాహానికి అడ్డుకట్టిన ఊళ్లమీద

నిన్నటివరకూ నిప్పులు చెరిగిన భానుడు
చెలరేగిపోయాడు తనని కూడా లెక్క చెయ్యని జనం మీద

ఈరోజు ఆగ్రహంతో ఊగిపోతున్న సముద్రుడు
విరుచుకుపడబోతున్నాడు మరోసారి సామాన్య ప్రజల మీద

ఓ కృష్ణమ్మా ! ఓ భానుడా ! ఓ సాగరుడా !
మీకు కూడా డొక్కలెండిన సామాన్యుడే లోకువా ?
మీ ప్రవాహంతో అవినీతిని కడగలేరా ?
మీ ప్రతాపంతో అన్యాయాన్ని భస్మం చెయ్యలేరా ?
మీ అలల వేగంతో కుత్సితం నిండిన వ్యవస్థను ముంచెత్తలేరా ?




Vol. No. 01 Pub. No. 291

4 comments:

కొత్త పాళీ said...

అబ్బే, అన్యాయాన్ని అవినీతినీ చూస్తే వాటికీ భయమే :)

జయ said...

బాగుందండి. చక్కటి భావంతో రాశారు.

Anonymous said...

ఒక పక్క ప్రకృతి విలయతాండవం చేస్తుంటే ఇలా కవిత్వమెలా వస్తుందబ్బా? దానికి పండితుల వారి మెచ్చుకోళ్ళు కూడా! బాగుంది! చాలా బాగుంది.

SRRao said...

* కొత్తపాళీ గారూ !
* జయ గారూ !

ధన్యవాదాలు

* అజ్ఞాత గారూ !
దీన్ని కవిత్వమని మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు. ఏ కవిత్వమైనా బాధలోంచి, ఆవేదనలోంచి పుడుతుందని, పదికాలాలపాటు నిలిచిన సాహిత్యం అలా పుట్టినదేనని మీకు తెలియదనుకోను. ఆ ఆవేదనను అర్థం చేసుకున్నవాళ్ళకు, పంచుకున్నవాళ్ళకు వందనాలు. అర్థం చేసుకోలేని వాళ్లకు, పంచుకోవడం ఇష్టంలేని వాళ్లకు శతకోటి వందనాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం