స్వాతంత్ర్యయోద్యమ సమయంలో జవహర్లాల్ నెహ్రు చాలాసార్లు జైలుకెళ్ళడం జరిగింది. ఒకసారి ఆయన వున్న ఒక జైల్లో ఆహారం చాలా ఘోరంగా ఉండేది. అన్నం నిండా రాళ్ళే ! ఆది భరించలేక నెహ్రుగారు జైలర్ కి ఫిర్యాదు చేశారు.
దానికా ఆంగ్ల జైలర్ " మీ దేశానికి స్వాతంత్ర్యం కావాలని జైలుకి వచ్చారు. మీరు మీ దేశాన్ని నిజంగా ప్రేమిస్తూ వుంటే తిండి విషయంలో పట్టింపు వుండకూడదు " అన్నాడు వెటకారంగా.
దానికి నెహ్రు బదులిస్తూ " అవును. నేను నిజంగానే నా మాతృభూమిని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ భూమినుంచి తయారైన అన్నం తినాలనుకుంటున్నాను గానీ రాళ్ళనూ, మట్టినీ తినేయ్యాలనుకోవడం లేదు " అన్నారట.
పండిట్ జవహర్లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ..........
Vol. No. 01 Pub. No.300
2 comments:
SRRao గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
హారం ప్రచారకులకు
చాలా సంతోషం. అభినందనలు.
Post a Comment