Saturday, May 15, 2010

కాటన్న జన్మదినం

 మా కాటన్న పుట్టిన రోజట నేడు
ఆంధ్రను అన్నపూర్ణగా మార్చిన మంత్రగాడు

అతడు కేవలం ఓ ప్రభుత్వాధికారి
అదీ పరాయి ప్రభుత్వ ఉద్యోగి 

ప్రజాసేవే పరమార్థంగా పనిచేసిన నిస్వార్థజీవి
కరవు రక్కసి కోరల్నుంచి రాష్ట్రాన్ని రక్షించిన ధన్యజీవి

అతని జీవితం నేటి మన ' స్వంత ' పాలకులకు, అధికార్లకు ఒక పెద్దబాలశిక్ష  
అతని జీవితంనుంచి  వారు  తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది ఏమీ లేదా ?   

 ' సర్ ఆర్థర్ కాటన్ ' జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ.........
ఆయనపై గతంలో రాసిన అపర భగీరధుడు చదవండి.

Vol. No. 01 Pub. No. 288

4 comments:

జయ said...

కాటన్న అంటే ఎవరా అనుకోని చూసాను. మొత్తానికి బాగుందండి. నిజమే నండి ఆయన గొప్పతనం సామాన్యమైంది కాదు. నేను కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

SRRao said...

జయ గారూ !
గోదావరి జిల్లాలలో ముఖ్యంగా కోనసీమలో ఇప్పటికీ అక్కడక్కడ కాటన్నలు కనిపిస్తారు. ఆ మహానుభావుడ్ని భారతీయుడ్ని, అందులోను తెలుగువాడిగా చేసేసుకున్నారండి మా కోనసీమ వాసులు. ఆయన పేరు పిల్లలకు పెట్టుకుని తమ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. ధన్యవాదాలు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

కొంచెం ఆలస్యంగా కాటన్న దొరకి జన్మదిన శుభాకాంక్షలు.

SRRao said...

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం