ఉరుములేని పిడుగు... ప్రజల నెత్తిన పడ్డ పేద్ద గ్యాస్ బండ
అంతులేని అవినీతికి అంగుడెక్కడ రాజకీయ వ్యాపారంలో....
దోచుకోవడం... దాచుకోవడం...
ప్రజల బ్రతుకు బండలు చెయ్యడం ప్రభుత్వాల వంతు.....
బండబారిన.... మోడువారిన...
బ్రతుకును నిస్సహాయంగా, నిస్తేజంగా వెళ్లదియ్యడం ప్రజల వంతు.....
అందువలన మేము కూడా ధరలు పెంచక తప్పలేదు.... వ్యాపారులు
మీరెంతైనా పెంచుకోండి కానీ మా ఆస్తులు మాత్రం పెంచండి.....నాయకులు, అధికారులు
కష్టార్జితమంతా మీ యెదాన పోసి మేమేం తిని బ్రతకాలి ? ......... ప్రజలు
అగ్ని ప్రమాదాలు లేవు.. ఆడపడుచుల వరకట్నఆత్మహత్యలు లేవు.....
ఎంత హాయి....ఇది నిజం... ఇది భారతదేశమే ! నమ్మండి.
ఎందుకంటే కిరోసిన్ ధర పెరిగింది... చావు కూడా ఖరీదయింది......
పేదల బ్రతుకు చీకటయ్యింది..... ప్రజల గుండె మండింది......
పెరిగింది స్వల్పమే..... పెరగాల్సింది చాలా వుంది..... అని సెలవిచ్చారు మంత్రివర్యులు
ఇక ప్రజలు భోంచేయాల్సింది గాలి.... చీకటిని తరమాల్సింది తమ కడుపులోని మంటతో.....
ఒప్పుకుంటే కుక్క మేకవుతుంది.... తలూపితే తల తాకట్టుకు వెడుతుంది....
దెబ్బకు దెయ్యం ఝడుస్తుంది... ప్రజలు కన్నెర్రజేస్తే ప్రభుత్వం కూలుతుంది....
ఆ సత్యం గ్రహిస్తే నల్లధనమూ బయిటకొస్తుంది... ఈ తత్త్వం ఒంటబడితే అవినీతీ అంతమవుతుంది....
అప్పడిక ధరలూ పెరగవు...... జీవన ప్రమాణాలూ తరగవు..... స్వార్థశక్తుల పెత్తనాలూ చెల్లవు.....
ఇక మనకు కూడా ప్రజా విప్లవాలు తప్పవేమో ! శిశుపాలుర శిరస్సులు ఖండించే రోజు దగ్గరలోనే ఉందేమో !
గ్యాస్ సిలండర్ పై సుమారు 50 రూపాయిలు, డీజిల్ లీటర్ పై సుమారు 3 రూపాయిలు, కిరోసేన్ లీటర్ పై సుమారు 2 రూపాయిలు ఈ అర్థరాత్రి నుండే ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రజల నెత్తిన పిడుగులాంటి వార్త.
Vol. No. 02 Pub. No. 264
4 comments:
రావుగారూ,ఈ సంగతి వినగనే నాకు తట్టిన జోక్ ఇందాకే నా బ్లాగ్ లో రాసాను చూడండి...నా మొదటి జోక్ ...:))
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.in - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్‌లో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా
saamaanyudi sanugudugaa mee chenakudu baagundi. chaala baaga raasaaru(spandinchaaru).
* తృష్ణ గారూ !
చూశాను. ధన్యవాదాలు
* చంద్రమోహన్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment