కాలం....దానిపని అది చేసుకుపోతూంటుంది
కాలం...ఒక ప్రవాహం...ఎవరికోసం..దేనికోసం ఆగదు
బాల్యం...ఒక తీపి జ్ఞాపకం
చీకూ చింతా లేని జీవితం
యవ్వనం ... ఒక మధురానుభవం
ఎన్నో అనుభూతులు, అనుభవాల సంగమం
వృద్ధాప్యం... ఒక జీవితానుభవం
పరిపూర్ణమైన జీవితానికి ప్రతిరూపం
మొదటి రెండు మజిలీలు పూర్తి చేసుకుని మూడో మజిలీ పొలిమేరల్లో వుండి....ఈ యాభై నాలుగేళ్ళ జీవితంలో సాధించింది ఏమిటీ అంటే ఆస్తులు, అంతస్తులు కాదు.... భోగభాగ్యాలు అంతకన్నా కాదు..... అంతకంటే విలువైన ....అంతులేని....అపారమైన నిదినిక్షేపాలు. అవే... ఇంటా బయిటా ఆత్మీయుల, స్నేహితుల ఆప్యాయతలు, అనురాగాలు.
అంతర్జాలంలో శిరాకదంబం తో ప్రారంభించి పేస్ బుక్, ట్విట్టర్, తెలుగు పీపుల్ డాట్ కామ్, ఇండ్యారాక్స్, మై స్పేస్, ఫ్యాన్ బాక్స్, వెయిన్, నెట్ లాగ్, జోర్పియా లాంటి అనేక సోషల్ సైట్ల ద్వారా ఎంతోమంది స్నేహితులు ఏర్పడ్డారు. నిజానికి వీరందరికీ ప్రత్యక్షంగా నాతో కంటే నా శిరాకదంబం తోనే అనుబంధం ఎక్కువ. ఆ రాతలు చదివి చాలామంది ఆప్తులుగా మారిపోయారు... అనుబంధం పెంచుకున్నారు.
ఇంతకంటే నాకేమి ఆస్తి కావాలి ? ఈ ఆప్యాయమైన పలకరింపులు చాలవా ? అందుకే ఈ బంధాలు కలకాలం వుండాలని కోరుకుంటూ......
మీ
శి. రా. రావు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక విన్నపం... మిత్రులందరూ తమకు వీలైనంతవరకూ పర్యావరణ పరిరక్షణకు కృషి చెయ్యండి... భావి తరాలకు ఆనందకరమైన జీవితాన్నిఅందించండి
Vol. No. 02 Pub. No. 250
6 comments:
రావుగారు,
హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు..
రావ్ గారు, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
రావు గారూ,హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Hope u had a nice day..:)
Happy B'day, Rao garu.
vinay datta and madhuri.
CHAALAA HRUDYAM GAA CHEPPAARU RAO GAARU...MEEKU JANMADINA SUBHAAKAANKSHALU.....AALASYAMGA CHEBUTHUNNANDUKU KSHANTAVYUDINI....
* జ్యోతి గారూ !
* జయ గారూ !
* తృష్ణ గారూ !
* మాధురి గారూ, వినయ్ !
* వెంకటేశ్వర్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment