Thursday, June 30, 2011

కవితాకళానిధి - సుత్తి వీరుడు



తెలుగు వారికి ' హరిశ్చంద్ర ' అందించిన గొప్ప రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతకవి. తెలుగు చలనచిత్ర తొలిదశలో అనేక చిత్రాలకు మాటలు - పాటలు అందించారు. కాళ్ళకూరి వారి పాత్ర సింగరాజు లింగరాజుకు ' వరవిక్రయం ' చిత్రంలో నటించడం ద్వారా జీవం పోశారు. ఇంకా కొన్ని చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించారు. 


బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి వర్థంతి నేడు. ఆయనకు కవితాకళా నీరాజనాలు అర్పిస్తూ....

 ఆయనపై గతంలోని టపా.......... 
 
 కవితాకళానిధి

*************

నటన అనేది ఒక వరం. పాత్రలో పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులకి నటిస్తున్నట్లు తెలియకుండా నటించగలిగే సామర్థ్యం దైవదత్తం. ఆ వరం పొందిన నటుడు మామిడిపల్లి ( సుత్తి ) వీరభద్రరావు. ఏ పాత్ర పోషించినా, ఆ పాత్రలో తనదైన శైలి ప్రదర్శించినా ఆ పాత్ర కనబడదు... వీరభద్రరావు కనిపిస్తారు. ఆయన వీరభద్రరావని మనకి తెలుసు. కానీ ఆయన్ని ఆ పాత్ర అధిగమిస్తుంది. అందుకే ఆయన తెలుగు ప్రేక్షకులకి మామిడిపల్లి వీరభద్రరావుగా గుర్తుండరు.... ఎప్పటికీ ' సుత్తి ' వీరభద్రరావుగానే గుర్తుంటారు.

సుత్తి వీరభద్రరావు వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......

ఆయన జయంతి సందర్భంగా రాసిన టపా.......

సుత్తి వీరుడు

Vol. No. 02 Pub. No. 269

2 comments:

taara said...

వీరబధ్రరావుగారు, సుత్తివేలు బందువులా? రావుగారు, ఇద్దరు కలిసి చేసిన మంచి,గుర్తుండిపోయే సినిమాలగురించి రాయరూ ప్లీజ్.

SRRao said...

తార గారూ !
సమాధానం కొంచెం ఆలస్యమైంది. క్షంతవ్యుణ్ణి. వీరభద్రరావు గారు,వేలు గారికి నాకు తెలిసినంతవరకూ బంధుత్వం లేదు, కళా బంధుత్వం తప్ప. మీరడిగినట్లు తప్పకుండా రాస్తాను. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం