Saturday, June 18, 2011

నక్షత్ర వృక్షాలు

 పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదన్న విషయం ఈరోజు మిత్రులు డిప్యూటీ కలెక్టర్ శ్రీ రహమతుల్లా గారు మెయిల్ లో పంపిన సందేశం..... అందరికోసం.............

జన్మ నక్షత్రం  పెంచవలసిన వృక్షము
అశ్వని అడ్డసరము ,విషముష్టి ,జీడిమామిడి
భరణి దేవదారు ,ఉసిరిక
కృత్తిక అత్తి ,మేడి
రోహిణి నేరేడు 
మృగశిర చండ్ర ,మారేడు
ఆరుద్ర రేల ,చింత
పునర్వసు వెదురు ,గన్నేరు
పుష్యమి పిప్పలి
ఆశ్లేష నాగకేసరి ,సంపంగి
మఖ మర్రి
పుబ్బ మోదుగ
ఉత్తర జువ్వి
హస్త కుంకుడు ,సన్నజాజి
చిత్త తాటిచెట్టు ,మారేడు
స్వాతి మద్ది
విశాఖ నాగకేసరి ,వెలగ ,మొగలి
అనూరాధ పొగడ
జ్యేష్ట విష్టి
మూల వేగిస
పూర్వాషాఢ నిమ్మ ,అశోక
ఉత్తరాషాఢ పనస
శ్రవణం జిల్లేడు
ధనిష్ట జమ్మి
శతభిషం అరటి ,కడిమి
పూర్వాభాద్ర మామిడి
ఉత్తరాభాద్ర వేప
రేవతి విప్ప

Vol. No. 02 Pub. No. 259

2 comments:

Vinay Datta said...

What is 'kadimi' ? It's given along with ' arati ' for Satabhisha.

madhuri.

SRRao said...

మాధురి గారూ !
' కడిమి ' అనేది ఒక చెట్టు పేరు. పురాణాల్లో వర్ణించిన కదంబ వృక్షమే ఈ కడిమి చెట్టని అంటారు. దాని విశేషం డా. తాడేపల్లి పతంజలి గారు వర్ణనలో ఈ క్రింది లింక్ లో చూడండి.

'http://siliconandhra.org/nextgen/sujanaranjani/may10/jayadeva.html'

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం