కనుక్కోండి చూద్దాం - 44_ జవాబు
ఈ క్రింద ఇచ్చిన ప్లేయర్ లో జాతీయ బహుమతులు గెల్చుకున్న ఒక తెలుగు చిత్రం యొక్క టైటిల్స్ లో వచ్చే సంగీతం వినండి.
అందులో గానం చేసిన గాయకుడు ..... ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో.. ముఖ్యంగా కె. విశ్వనాధ్ గారి చిత్రాల్లో కొన్ని పాటలు పాడారు.
అంతేకాదు ఆయన శాస్త్రీయ సంగీతంలో దిట్ట.

ప్రశ్న : ఆ గాయకుడు ఎవరో చెప్పగలరా ?
జవాబు : ఈ గానం ' మేఘసందేశం ' చిత్రం టైటిల్స్ సమయంలో వస్తుంది. గాయకుడు పూర్ణచందర్ . ఈయన కర్నాటక సంగీతంతో బాటు హిందుస్తానీ సంగీతం కూడా గానం చేస్తారు. ఉర్దూ ఘజల్స్ పాడడంలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక కచేరీలు చేసారు. గాత్రమే కాక ఆయన వయోలిన్ వాద్య కళాకారుడు కూడా ! మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి చాలా కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు.
పూర్ణచందర్ కి బంధువు, ఒకప్పటి నటుడు ముదిగొండ లింగమూర్తి గారి ప్రోత్సాహంతో మద్రాసులో అడుగుపెట్టి, తెలుగులో చలం నిర్మించిన సన్నాయి అప్పన్న చిత్రానికి మూలమైన కన్నడ చిత్రం షనాది అప్పన్న తో చలనచిత్ర సీమలో అడుగు పెట్టారు.
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రానికి ఆయన పాడిన తిల్లానా చిత్రంలో లేకపోయినా రికార్డులుగా, కాసెట్లలోను విడుదలై ఆరోజుల్లో ప్రజాదరణ పొందింది.
విశ్వనాథ్ గారి శుభలేఖ చిత్రంలో అక్కడక్కడ వినిపించే ఆలాపన కూడా పూర్ణచందర్ గానం చేసినదే ! చాలామంది ఆ గానం బాలు గారిదని భ్రమ పడ్డారు. దానికి బాలు గారు అప్పట్లో పత్రికా ముఖంగా వివరణ ఇచ్చారు కూడా !
విశ్వనాథ్ గారి శృతిలయలు చిత్రంలో కూడా కొన్ని పాటలు పాడారు. వాటిలో రెండింటిని ఇక్కడ వినండి......
జవాబు : ఈ గానం ' మేఘసందేశం ' చిత్రం టైటిల్స్ సమయంలో వస్తుంది. గాయకుడు పూర్ణచందర్ . ఈయన కర్నాటక సంగీతంతో బాటు హిందుస్తానీ సంగీతం కూడా గానం చేస్తారు. ఉర్దూ ఘజల్స్ పాడడంలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక కచేరీలు చేసారు. గాత్రమే కాక ఆయన వయోలిన్ వాద్య కళాకారుడు కూడా ! మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి చాలా కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు.
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రానికి ఆయన పాడిన తిల్లానా చిత్రంలో లేకపోయినా రికార్డులుగా, కాసెట్లలోను విడుదలై ఆరోజుల్లో ప్రజాదరణ పొందింది.
విశ్వనాథ్ గారి శుభలేఖ చిత్రంలో అక్కడక్కడ వినిపించే ఆలాపన కూడా పూర్ణచందర్ గానం చేసినదే ! చాలామంది ఆ గానం బాలు గారిదని భ్రమ పడ్డారు. దానికి బాలు గారు అప్పట్లో పత్రికా ముఖంగా వివరణ ఇచ్చారు కూడా !
విశ్వనాథ్ గారి శృతిలయలు చిత్రంలో కూడా కొన్ని పాటలు పాడారు. వాటిలో రెండింటిని ఇక్కడ వినండి......
పై ప్రశ్నకు సమాధానమిచ్చిన సూర్యనారాయణ గారికి, సమీర గారికి ధన్యవాదాలు.
Vol. No. 02 Pub. No. 256a
4 comments:
ovunandi. inka okkasaari vinte meeku nenu correct samaadhanam ichchedanni. thodarapaddanu. paata chaala slow gaa vachchindandi mundu. opika poindi. but manchi quiz e pettaru ma medadu ki. thanks.
సమీర గారూ !
ఫర్వాలేదండీ ! ఈసారి కొంచెం సమయం తీసుకుని ఆలోచించి జవాబు చెప్పండి. అలా గుర్తు చెయ్యడానికే అప్పుడప్పుడు ఇలా క్విజ్ పెడుతున్నాను. దీనివల్ల మిత్రులకు తెలిసిన కొన్ని కొత్త విషయాలు కూడా బయిటకొస్తాయని నా ఆశ. ధన్యవాదాలు.
nijanga mee blog chudatam voka madhuramyna anhubhuthi anubhvam kuda . meeku dhanya vaadalu
Gosala
వాసు గారూ !
ధన్యవాదాలు
Post a Comment