చరిత్ర పునరావృతమవుతుందనడం మనం అప్పుడప్పుడు వింటూ వుంటాం. అలాగే మన చిత్రసీమలో వేషాలు, ఒక్కోసారి వేషధారణలు, ఆహార్యాలు కూడా పునరావృతమవుతాయనడానికి ఉదాహరణలు.
మాయాబజార్ చిత్రం నందమూరి తారకరామారావు గారిని వెండితెర కృష్ణుడిని చేసిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. అంతకుముందు సొంతవూరు అనే చిత్రంలో కృష్ణుడిగా కనబడినా అది కొంచెం సేపే అవడం వల్ల ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోలేదు. అయితే మాయాబజార్ కృష్ణుడు అంత సులువుగా తయారుకాలేదు. ఆ వేషం, ఆహార్యం అంత అందంగా రూపొందడానికి ముందు ఎంతో కసరత్తు జరిగింది. కళాదర్శకుడు మా. గోఖలే గారి పర్యవేక్షణలో ఎందఱో కళాకారులు అనేక రేఖాచిత్రాలు గీసారు. అందులో సింహభాగం విజయా సంస్థకు ఆస్థాన కళాకారుడైన కళాధర్ గారు గీసినవి. చక్రపాణి గారి నేతృత్వంలోని పెద్దలు అవన్నీ పరిశీలించి చివరగా ఒక నిర్ణయానికొచ్చి కృష్ణునికి అంత అందమైన రూపాన్ని తీసుకొచ్చారు. అందుకే ఆ కృష్ణుడే తెలుగు వారి మనస్సులో నిలిచిపోయాడు.
మళ్ళీ 39 సంవత్సరాలకి రామారావు గారి వారసుడు బాలకృష్ణ నటించిన " శ్రీకృష్ణార్జున విజయం " చిత్రంలో ఆనాటి " మాయాబజార్ " చిత్రంలో రామారావు గారికి ఉపయోగించిన ఆభరణాలు మొదలైనవి బాలకృష్ణకు ఉపయోగించారు.
ఇప్పుడు బాపు గారి " శ్రీరామరాజ్యం" చిత్రంలో బాలకృష్ణకు... ఆనాడు వెండితెర రాముడికి " లవకుశ " చిత్రంలో ఉపయోగించిన కిరీటం ఉపయోగిస్తున్నారు.
Vol. No. 02 Pub. No. 255
3 comments:
బాపుగారికి అత్యంత ఇష్టమైన "శ్రీరామ"రాజ్యం కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
చక్కని విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు ! ............సురేఖ
సురేఖ గారూ !
ధన్యవాదాలు
ఆహార్యం పునరావృతం 10/06/2011
మంచిదే, ఆహార్యం పునరావృతం చేస్తారు కాని అ నటన అందం, కంఠం ఉచ్చారణ నవ్వు ఇవి ఎవరు చస్తారు?
గుమ్మా రామలింగ స్వామి
26/07/2013
Post a Comment