కళాకారుడు సున్నిత మనస్కుడు
కళాకారుడు ఎప్పుడూ నిరంకుశుడు
తన కళ గురించి కలలు కంటూ ఉంటాడు
అవి నెరవేర్చుకోవడానికి ఏటికి ఎదురీదుతాడు
తానూ అనుకున్నది ఆవిష్కరిస్తాడు
దానికోసం ఎన్ని విమర్శలనైనా భరిస్తాడు
కళ పంకజం లాంటిది
బురదలో వున్నా మకిలి అంటదు
కళాకారుడు వజ్రంలాంటి వాడు
అతని కళకు ఎప్పుడూ కళంకం లేదు
ఎవరి మెప్పుకో కళాకారుడు కాలేడు
ఆత్మతృప్తికి మాత్రమే అతను బానిస కాగలడు
ఎవరికో నచ్చడానికి కళాకారుడు కాలేడు
తనకి నచ్చింది మాత్రమే అతను చెయ్యగలడు
రవిగాంచని చోట కవి గాంచున్ అన్నది నానుడి
సామాన్యుడు చూడని లోకం కళాకారుడు చూడగలడు
పదిమంది మెప్పుకోసం మాత్రమే చేసేవాడు వ్యాపారి
తను కళను పదిమందీ మెచ్చేటట్లు చేసేవాడు కళాకారుడు
తనదైన లోకంలో విహరించేవాడు కళాకారుడు
కళ కళ కోసమేనని నమ్మేవాడు కళాకారుడు
...... అలా ఎవరేమనుకున్నా తనదైన లోకంలో విహరించి
ఒక కళాకారుడిగా తనదైన వ్యక్తిత్వం చూపించి
నిజమైన కళాకారుడిగా జీవించి
కళా జీవితాన్ని ముగించిన
ఎం. ఎఫ్. హుస్సేన్ కు కళాంజలులతో ..........
5 comments:
వాడి బొంద ! వాడి బతుక్కి వాడూ ఒక కళాకారుడు ! హిందూ సంప్రదాయాల్ని అడుగడుగునా అవమానిస్తూ బొమ్మలు గీసిన పరమ ఛండాలుడు. కాస్త ఆలస్యంగా నైనా భూభారం వదిలింది.
అజ్ఞాత గారూ !
నా దృష్టిలో ఆయన గొప్ప కళాకారుడు. అంతే ! కళల్ని, కళాకారుల్నీ గౌరవించడం నాకు అలవాటు. మిగిలిన విషయాలమీద ఎప్పుడో విస్తృతమైన చర్చ జరిగింది. ఆ విషయాలు ఇప్పుడు అప్రస్తుతం. అయినా దేవుడి పేరు చెప్పి దోచుకునే వారికంటే, ప్రజల చెమటను దోచుకునే రాజకీయనాయకుల కంటే ఆయనేమీ దుర్మార్గుడు కాదని నా అభిప్రాయం. మీ వాడి, వేడి వ్యాఖ్యల్ని అలాంటి వారి మీద సంధిస్తే సమాజానికి కొంతైనా మేలు చేసిన వారవుతారు.
దయచేసి ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు ఇక్కడ రాయవద్దని మనవి.
SRRaoగారు మీరు చేసిన పోలిక అతని కీర్తి ఇనుమడించిందా? ఆ బూతు 'కళాకారుణ్ణి' మత మోసకారులతోనూ, కుళ్ళు రాజకీయనాయకులతోనూ, అదేటి .. ' చమట దోపిడీకారుల'తోనూ పోల్చినందుకు మీరైనా క్షమాపణ చెప్పండి, లేదా ఖాళీగావున్న క్షమాపణ స్పెషలిస్ట్ అద్వానీతోనైనా చెప్పించండి. ;) :)
Snkr గారూ !
ప్రతి మనిషిలోను మంచి, చెడ్డ రెండూ వుంటాయి. ఆయన్ని ఒక కళాకారుడిగా మాత్రమే చూసాను.మరణించిన వారి గురించి ఆ సమయంలో మంచి మత్రమే మాట్లాడే సంప్రదాయం మనది. ఎప్పుడో ముగిసిన చర్చను ఆయన మరణం తర్వాత కూడా లేవనెత్తడం భావ్యం కాదు. మీ భావాలు మీవి. నా భావాలు నావి. నా భావాలు మీకు నచ్చనంత మాత్రాన నేను క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఇకపైన ఈ విషయం మీద దయచేసి చర్చలు చెయ్యవద్దు.
అలాగేనండి. మీరెలా అంటే అలానే - చర్చలు చేయమంటే చేస్తాము, నోరు మూయమంటే మూస్తాము, 'జై' కొట్టమని సైగ చేస్తే జైకొడతాము,కామెంటమంటే కామెంటుతామనే అనుకోండి. మీకిష్టమొచ్చింది రాయొద్దని మాటవరసగా ఐనా చెప్పము. :)
మీరంటే ఓ అభిమానంతో ఓ సలహా ఇస్తున్నా: విజిటర్లను అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలానే కామెంటాలి, అప్పుడే కామెంటాలి... ఇలా ఆంక్షలు విధించడం అంత బాగుండదేమో... పునరాలోచించగలరు. చనిపోయాక చెడ్డవాడు కూడా మంచివాడవుతాడన్న మీరు చెప్పిన సాంప్రదాయానికి/ స్పూర్తికి విరుద్ధంగా రాంలీలా మైదానంలో రావణుడు ప్రతిఏటా ఎందుకు కాల్చబడుతున్నాడు? దీపావళి ముందురోజు దుష్టనరకచతుర్దశిగా తరాలుగా ఎందుకు పరిగణింపబడుతోంది?
Post a Comment