పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదన్న విషయం ఈరోజు మిత్రులు డిప్యూటీ కలెక్టర్ శ్రీ రహమతుల్లా గారు మెయిల్ లో పంపిన సందేశం..... అందరికోసం.............
| జన్మ నక్షత్రం | పెంచవలసిన వృక్షము |
| అశ్వని | అడ్డసరము ,విషముష్టి ,జీడిమామిడి |
| భరణి | దేవదారు ,ఉసిరిక |
| కృత్తిక | అత్తి ,మేడి |
| రోహిణి | నేరేడు |
| మృగశిర | చండ్ర ,మారేడు |
| ఆరుద్ర | రేల ,చింత |
| పునర్వసు | వెదురు ,గన్నేరు |
| పుష్యమి | పిప్పలి |
| ఆశ్లేష | నాగకేసరి ,సంపంగి |
| మఖ | మర్రి |
| పుబ్బ | మోదుగ |
| ఉత్తర | జువ్వి |
| హస్త | కుంకుడు ,సన్నజాజి |
| చిత్త | తాటిచెట్టు ,మారేడు |
| స్వాతి | మద్ది |
| విశాఖ | నాగకేసరి ,వెలగ ,మొగలి |
| అనూరాధ | పొగడ |
| జ్యేష్ట | విష్టి |
| మూల | వేగిస |
| పూర్వాషాఢ | నిమ్మ ,అశోక |
| ఉత్తరాషాఢ | పనస |
| శ్రవణం | జిల్లేడు |
| ధనిష్ట | జమ్మి |
| శతభిషం | అరటి ,కడిమి |
| పూర్వాభాద్ర | మామిడి |
| ఉత్తరాభాద్ర | వేప |
| రేవతి | విప్ప |
Vol. No. 02 Pub. No. 259

2 comments:
What is 'kadimi' ? It's given along with ' arati ' for Satabhisha.
madhuri.
మాధురి గారూ !
' కడిమి ' అనేది ఒక చెట్టు పేరు. పురాణాల్లో వర్ణించిన కదంబ వృక్షమే ఈ కడిమి చెట్టని అంటారు. దాని విశేషం డా. తాడేపల్లి పతంజలి గారు వర్ణనలో ఈ క్రింది లింక్ లో చూడండి.
'http://siliconandhra.org/nextgen/sujanaranjani/may10/jayadeva.html'
Post a Comment