ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల ఆరోగ్య రక్షణకై తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్య దినోత్సవ థీమ్ గా ' ఔషధ నిరోధంపై పోరాటం ' ప్రకటించింది. ఈరోజు చర్య తీసుకోకుంటే రేపు నివారణ ఉండదని కూడా తమ ప్రకటనలో చేర్చింది. అంతేకాదు. సూక్ష్మజీవుల నిర్మూలన, నిరోధం కోసం పోరాటం చెయ్యాలని.... తద్వారా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పూనుకుంది. దానికోసం ఓ షట్ సూత్ర ప్రణాళికను రూపొందించింది. ఆ ప్రణాళికలోని అంశాలు ......
1 . ప్రజల భాగస్వామ్యంతో జవాబుదారీతనంతో ఒక సమగ్ర ఆర్ధిక ప్రణాళికను రూపొందించి అమలు చెయ్యాలి.
2 . పరిశోధనశాలలను అభివృద్ధి చెయ్యడంతో బాటు పర్యవేక్షణను కూడా బలోపేతం చెయ్యాలి.
3 . అవసరమైన పరిమాణంలో అత్యవసర మందుల పంపిణీని నిరంతరాయంగా ఖచ్చితంగా జరిగేటట్లు చూడాలి.
4 . పాడి పరిశ్రమతోబాటుగా అన్ని రంగాల్లోనూ విచ్చలవిడిగా జరుగుతున్న మందుల వాడకాన్ని నియత్రించడం, హేతుబద్ధమైన వాడకాన్ని మాత్రమే ప్రోత్సహించడం చెయ్యాలి. రోగుల విషయంలో సరైన శ్రద్ధ తీసుకోవాలి.
5 . అంటువ్యాధుల వ్యాప్తిని నియత్రించడం, నిరోధించడం కట్టుదిట్టంగా అమలు చెయ్యాలి.
6 . కొత్త విధానాల పరిశోధనను అభివృద్ధి చెయ్యాలి.
ఔషధ నిరోధంపై పోరాటం
ఈరోజు చర్య లేకుంటే రేపు నివారణ లేదు
Vol. No. 02 Pub. No. 193
2 comments:
ఈరోజు చర్య లేకుంటే రేపు నివారణ లేదు
-well said sir
గిరీష్ గారూ !
ధన్యవాదాలు. అది WHO వాళ్ళు ఇచ్చిన స్లోగన్ లోదేనండీ !
Post a Comment