హిందువులకు గోవు పరమ పవిత్రమైనది. పండగలకి, పబ్బాలకి గోవుని పూజించడం మన సాంప్రదాయం. మాంసం కోసం ఏ జంతువును వదించినా పెద్దగా స్పందించని హిందువులు గోవద నిషేధంపై అనేక ఉద్యమాలు చేసారు. గోసంరక్షణ సమితిలు నెలకొల్పారు.
అలాంటి ' గోవు హృదయంలో జొరబడి దాని స్వభావమంతా పూసగుచ్చినట్లు చెప్పారే ! ' అని ఘంటసాల గారి చేత ప్రశంసలు అందుకున్న కొసరాజు గారి పాట ' గోవుల గోపన్న ' చిత్రంలోనిది. రాజ్యం ప్రొడక్షన్స్ వారు అక్కినేని నాగేశ్వరరావు, భారతి, రాజశ్రీ తారాగణంగా సి. యస్. రావు గారి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి మూలం ' ఎమ్మె తమ్మన్న ' అనే కన్నడ చిత్రం. దాన్ని తెలుగుతో బాటు తమిళంలో ' మాట్టుకారవీలన్ ' గా, హిందీలో ' జిగ్రీ దోస్త్ ' గా పునర్నిర్మించారు..
' గోవుల గోపన్న ' చిత్రంలో ఆవుది కూడా ఓ ప్రధానమైన పాత్ర. కనుక ఆవుపై కూడా ఓ పాట పెట్టాలని నిర్ణయించారు. ఆ పాట రాసే పనిని ప్రముఖ రచయిత కొసరాజు గారికి అప్పగించారు. గోవు మదిలో మెదలడానికి ఆస్కారమున్న ఆలోచనల్ని ఊహించి మరీ రాయమని సూచించారు దర్శకులు సి. యస్. రావు గారు. కొసరాజు గారు ఏమి రాసి పట్టుకొచ్చినా తాను ట్యూన్ చేస్తానని ఘంటసాల అన్నారు. దాంతో కొసరాజు గారు మొదట పల్లవి రాసి పట్టుకెళ్లారు. అది....
వినరా వినరా నరుడా !
తెలుసుకోర పామరుడా !
గోమాతను నేనేరా ! నాతో సరిపోలవురా !
..... ఈ పల్లవి దర్శకులు సి. యస్. రావు గారికి, సంగీత దర్శకులు ఘంటసాల గారికి నచ్చింది. అందులో నవ్యత కనబడింది. అదే ఒరవడిలో చరణాలను రాయమన్నారు. కొసరాజు గారు కొన్ని చరణాలు రాయగా అందులోనుంచి కొన్నిటిని ఎంపిక చేసారు సి. యస్. రావు గారు. పల్లవిలో గొప్ప ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించిన గోవు తర్వాత చరణాలలో కూడా ఆ స్తైర్యాన్నే కొనసాగించింది.
కొసరాజు గారు నిజంగానే గోవు హృదయంలో జొరబడి ఈ పాట రాస్తే.... ఆ గోవులో పరకాయ ప్రవేశం చేసినట్లు ఘంటసాల గారు అద్భుతంగా ఈ పాటను గానం చేసారు. ఆ అద్భుతమైన పాట మీ కోసం......
Vol. No. 02 Pub. No. 206
2 comments:
This is one of my favourite songs, for the reasons you have mentioned in your post. I keep humming it often.
madhuri.
మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment