Wednesday, February 23, 2011

విదేశీ మోజు


మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో
మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం 



...... అలాగే మనకు విదేశాల మీద, వారి అలవాట్లు, ఆచార వ్యవహారాల మీద ఎంత ఆసక్తి, మోజు ఉంటాయో విదేశీయులకు కూడా మన సాంప్రదాయాల మీద మోజు వుండడం సహజం. మనమెప్పుడో మన వివాహ పద్ధతుల్లో విదేశీ పద్ధతుల్ని చాపక్రింద నీరులా కలిపెయ్యడం ప్రారంభించాం. మన వివాహ వ్యవస్థలో వున్న తంతులకి, మంత్రాలకి ఎప్పుడో మంగళం పాడేశాం. ఐదురోజుల తతంగాన్ని ఐదు గంటలకు ఇంకా వీలయితే గంటలోకి కుదించడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఆర్భాటాలు మాత్రం పెంచుకుంటూ పోతున్నాం. చక్కగా పలకరింపులతో పంక్తి భోజనం చెయ్యడం దగ్గర్నుంచి హడావిడిగా మన ప్రక్కన ఎవరున్నారో గమనించే తీరిక కూడా లేకుండా బఫే భోజనంతో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని తెచ్చిన బహుమతిని వదూవరులకిచ్చేసి అభినందనలు చెప్పేసి వీలయితే మన హాజరుకు సాక్ష్యంగా వాళ్ళతో ఒక ఫోటో లాగించేసి ' బెస్ట్ అఫ్ లక్ ' తో బాటే బై కూడా చెప్పేస్తున్నాం. పెళ్ళివారు కూడా మండప అలంకారానికి, వాళ్ళ అలంకారానికి ఇచ్చిన ప్రాధాన్యత పెళ్లి తంతుకి ఇవ్వడం లేదు. 

మన వివాహ వ్యవస్థలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతుంటే విదేశీయులను  మన వివాహ వ్యవస్థ ఎంతగా ఆకర్షిస్తోందో ప్రపంచ ప్రసిద్ధ నటుడు చార్లీ చాప్లిన్ మనవడి పెళ్లి గురించి చదివితే అర్థమవుతుంది.  

ఈనాటి ( ఫిబ్రవరి 23 ) ఈనాడు పత్రికలోని ఈ వార్త లింక్ ఇదిగో.........

 Vol. No. 02 Pub. No. 153

2 comments:

jaggampeta said...

nijame kadha

SRRao said...

జగ్గంపేట గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం