బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్చా వాయువులు పీలుస్తున్న భారతదేశ పరిపాలనా వ్యవస్థను క్రమ పద్ధతిలో పెట్టడానికి ఏర్పాటు చేసినదే రాజ్యాంగ రచనా సంఘం. 1946 డిసెంబర్ 9 న ఏర్పాటైన ఆ సంఘానికి తొలి అధ్యక్షుడు డా. సచ్చిదానంద సిన్హా అయితే మలి అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్.
1948 నుండి 1950 వరకూ రాజ్యాంగ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు డా. బాబూ రాజేంద్రప్రసాద్. 1949 వ సంవత్సరం నవంబర్ 26 న ఆమోదం పొందిన మన రాజ్యాంగం 1950 జనవరి 26 వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఆరోజే ఆ రాజ్యాంగ సంఘ సారధి భారత దేశ తొలి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి పన్నెండు సంవత్సరాలు మన రాష్ట్రపతిగా పని చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ 1962 లో స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఆయన పదవీ విరమణ చేసిన కొద్దిరోజులకే ఆయన భార్య రాజ్ వంశీ దేవి మరణించారు.
" నాకు పని చేసే శక్తి తగ్గిపోయింది. నేను జీవించే కాలం అయిపోయిందని, అంత్యకాలం సమీపించినదని గట్టిగా అనిపిస్తోంది "
- ఇది డా. బాబూ రాజేంద్రప్రసాద్ తన అనుచరుడొకరికి రాసిన ఉత్తరంలోని భాగం. సరిగ్గా ఇది రాసిన నెలకు... 28 ఫిబ్రవరి 1963 న రాజేంద్రప్రసాద్ ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోయారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ సంఘ సారధి, భారత తొలి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ.......
డా. బాబూ రాజేంద్రప్రసాద్ విశేషాలతో గతంలోని టపా లింక్ .........
మన తొలి రాష్ట్రపతి
Vol. No. 02 Pub. No. 160
2 comments:
"రాష్ట్రపతులంటే అలాటి వారే నండి! రాధాకృష్ణన్, అబ్దుల్ కలామ్ లాంటి వాళ్ళను వేళ్లమీద లెక్క పెట్టవచ్చు ! మిగతావారు కీలుబొమ్మలే!!"
అప్పారావు గారూ !
ధన్యవాదాలు
Post a Comment