లోకానికే నాథుడు కాశీ విశ్వనాథుడు
తెలుగు చిత్రాధినాథుడు కాశీనాథుని విశ్వనాథుడు
సృష్టి స్థితిలయ కారకుడు ఆ కాశీ విశ్వనాథుడు
వెండితెర శ్రుతిలయల కారకుడు ఈ కాశీనాథుని విశ్వనాథుడు
హాలాహలాన్ని గళాన్ని దాల్చిన గరళ కంఠుడు కాశీ విశ్వనాథుడు
అదుపుతప్పిన చిత్ర రంగాన్నిఅందలమెక్కించిన మహానుభావుడు కాశీనాథుని విశ్వనాథుడు
హంగులు, ఆర్భాటాలు అక్కరలేని భోళా శంకరుడు కాశీ విశ్వనాథుడు
అశ్లీలం, అసభ్యత లేని సజీవ చలన చిత్ర కళామూర్తి కాశీనాథుని విశ్వనాథుడు
శుభప్రదమైన చిత్రాలను అందించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపిన విశ్వనాథుడు
గురువు గారి జన్మదినం సందర్భంగా నమస్సులతో .....................
తెలుగు చలనచిత్రరంగ ' స్వాతికిరణం ' లింక్ .............................
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_19.htmlVol. No. 02 Pub. No. 148
3 comments:
శృతి లయలు అనండి.
వారికి శుభాకాంక్షలు, మీకు ధన్యవాదములు
* రాజేంద్రకుమార్ గారూ !
దొర్లిన పొరబాటుకు మంచి సవరణ సూచించారు. ధన్యవాదాలు.
* ఊకదంపుడు గారూ !
ధన్యవాదాలు
Post a Comment