కనుక్కోండి చూద్దాం - 36
ఈ రెండు ప్రశ్నలకు ఇద్దరు వేర్వీరుగా సమాధానాలు చెప్పారు. మాధురి గారు మొదటి ప్రశ్నకు, జ్యోతి గారు రెండవ ప్రశ్నకు సరైన జవాబులే ఇచ్చారు. ' రేఖా చిత్రం ' బ్లాగు అప్పారావు గారు పేస్ బుక్ లో అడిగారు ' ఇంతకీ ఆ నటుడెవరు ?' అని. రాజేంద్రకుమార్ గారు ఇతరులకు అవకాశం ఇవ్వడానికి ఆగినట్లున్నారు. సరైన సమాధానమిచ్చిన మాధురి..జ్యోతి గార్లకు, స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. ఇక జవాబులు .................
1 ) ఈ ప్రక్క స్టిల్ లో ఎన్టీ రామారావు గారి ప్రక్కన ఎర్రటి వలయంలో గుర్తు పెట్టిన నటుడు ఎవరో గుర్తుపట్టగలరా ?
జవాబు : శంకరాభరణం, సాగరసంగమం, స్వాతి ముత్యం లాంటి చిత్రాలను నిర్మించి తెలుగు చిత్ర ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన పూర్ణోదయ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు గారు.
2 ) ఈ స్టిల్ ఏ చిత్రంలోదో కూడా చెప్పగలరా ?
జవాబు : ఎన్టీయార్ నటించిన ' ఆత్మబంధువు ' చిత్రంలోనిది. ఇందులో ఏడిద నాగేశ్వరరావు ఎస్వీ రంగారావు కుమారునిగా నటించారు.
Vol. No. 02 Pub. No. 137a
2 comments:
కొన్ని సార్లు బరహ ఉపయోగించి తెలుగు వాడలేక పోతున్నాను,అదొక కారణం,రెండో ది మీకు చెప్పిందే,అయితే ఇక్కడ మీరన్నట్టు ఏడిద గోపాల రావు ఆత్మబంధువు సినిమాలో యస్వీఆర్ పెద్ద కొడుకు కాదండి,రెండో కొడుకు.పెద్ద కొడుకు పాత్ర ధారి వల్లం నరసింహరావు( ఈ వ్యాఖ్య లేఖిని సౌజన్యంతో రాసినది)
రాజేంద్ర కుమార్ గారూ !
ముందుగా మీ సవరణకు ధన్యవాదాలు. మీరు అక్షరమాల వాడి చూడండి. కాపీ, పేస్టు కాకుండా నేరుగా టైపు చెయ్యొచ్చు. బాగానే పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ టూల్ గానీ, గూగుల్ టూల్ గానీ ప్రయత్నించలేదా ?
Post a Comment