బాపురమణ జంట నిర్మించిన తోలి చిత్రం ' సాక్షి '. ఆ చిత్రంలో ఆరుద్ర పాటలు రాసారు. ఆ అనుభవాలను చెబుతూ ఆరుద్ర .............................
సాక్షి చిత్రం ప్రారంభిస్తున్న రోజు - కొన్ని పాటలే రాయవలసిన నాకు అన్ని పాటల సన్నివేశాలు చెప్పారు. పది నిముషాల్లో పాట రాసి భేష్ అనిపించుకున్నాను. నన్ను ఆ చిత్రంలో బహు యిబ్బంది పెట్టేసారు. మూడు నాలుగు నెలలైనా ఒక పాట నేను మొదలు పెట్టలేకపోయాను. ఆ సన్నివేశం అంత ఇబ్బందికరమైనది. మరణం తప్పదని నిశ్చయించుకున్న మనసైన వాడిని మనువాడదలచిన పిల్ల పాడే పాట అది. పల్లవి తట్టడానికి అన్నాళ్ళు పట్టింది నాకు. పల్లవి దొరకగానే పది నిముషాల్లో రాసేసాను.
బాపు గారు ' భేష్ ' అన్నారు. రమణగారు అనలేదు. భేష్ అనడం రమణగారికి చేతకాదు.... ఏదైనా మనసుకి బాగా పట్టేస్తే నోట్లో నాలుక మీద వేలు అడ్డంగా పెట్టి ఈల వేయడం తప్ప. రమణగారు ఇంకోలాగ అయినవాళ్ళ మధ్య ఆనందం ప్రదర్శించలేరు. ఆ తర్వాత ఎన్ని పాటలు రాసాను... ఎన్ని భేష్ లు అన్నారు.... ఎన్ని ఈలలు విన్నాను.
బాపు గారి చేత ' భేష్ ' అనిపించి, రమణ గారి చేత ఈల వేయించిన ఆ పాట ..................
Vol. No. 02 Pub. No. 158
9 comments:
Bagundandi. Did you find this in any particular book? Please let me know. Sorry for posting this comment in English. I am using someone else's computer. The photo you posted is also rare. Thank you for sharing it with us.
విజయవర్ధన్ గారూ !
బాపు గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ ( గౌరవ డాక్టరేట్ ) ఇచ్చిన సందర్భంగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రత్యేకంగా ప్రచురించిన ఆరుద్ర గారి వ్యాసం లోని భాగం ఇది. ధన్యవాదాలు.
చాలా బావుంది సార్. అరుదైన విషయాలు తెలియచేసారు.. ధన్యవాదాలు.
సుభద్ర గారూ !
ధన్యవాదాలు
ఎక్సలెంట్ రావు గారు. ఆరుద్ర గారు బాపు రమణల గురించి చెప్పిన అరుదైన విషయాలు మాకు అందజేసినందుకు ధన్యవాదలండి. రావు గారు, మీరు బ్లాగ్ లో చాలా బాగా రాస్తారండి.
ramachandra rao garu-meeratlu- aarudragaarikeee bapuramana( iddaroo okatenanee- anduvalla iddarikee madhya -[hyphen]vundakoodadanee --okachota chadivina meedata -bapuramana ani yekapadam gaa raasaanu-gamaninchagalaru)kee 'chitra'paramgaa- 'ee naati ee bandhamenaatido?!' andukane kaabolu,vaari chitraalannitilonoo- ee pratyekatha- kottavacchinatlu kanabaduthundi manaki.- voleti venkata subbarao,slough/UK
* దుర్గ గారూ !
ధన్యవాదాలు. నేను కేవలం నా సేకరణ సంపదలోనుంచి కొన్ని విశేషాలను మీ అందరితో ఈ బ్లాగు ద్వారా పంచుకుంటున్నాను. ఇందులో నేను ప్రత్యేకంగా రాసేది పెద్దగా ఏమీ లేదండి, ఉన్న విషయాన్ని సందర్భోచితంగా అందించడం తప్ప.... అది మీలాంటి మిత్రులకు నచ్చుతున్నందుకు, నా సేకరణ ఇలా సార్థకం అవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది.
* సుబ్బారావు గారూ !
బాపురమణల గురించి ఆరుద్ర గారి మరో మంచి మాట చెప్పారు. చాలా సంతోషం. ఈసారి ముళ్ళపూడి గారి గురించి రాసే మరో టపాలో ఇది కూడా కలుపుతాను. నా సేకరణ సంపదకు మీరు మరిన్ని జోడించి ఆ సంపదను మరింత పెంచుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీలాంటి అనుభవజ్ఞులు, పెద్దల ప్రోత్సాహం లభించడం నా అదృష్టం.
రావు గారు,
ఈ postలో వున్న photo high quality లో వుంటే దయచేసి నాకు పంపగలరా.
ధన్యవాదాలతో
భవదీయుడు
విజయ్
విజయవర్ధన్ గారూ !
ధన్యవాదాలు. ఈ ఫోటో కూడా పత్రికలోనిదే ! మీకు ఫర్వాలేదంటే తప్పక పంపుతాను.
Post a Comment