2009 లో అనుకోకుండా బ్లాగులోకంలోకి తొంగి చూసిన నన్ను సూదంటు రాయిలా ఆకట్టుకుంది. అప్పటికే బ్లాగులోకంలో లబ్దప్రతిష్టులైన వాళ్ళందరి బ్లాగులను పరిశీలించడం ప్రారంభించాను. ఫలితంగా ఆ సంవత్సరం ఆగష్టు 14 న అనుకోకుండా ఈలోకంలో అడుగుపెట్టాను. అప్పటికి నాకు ఎంతకాలం ఈ బ్లాగు నడుపగలనో తెలీదు. నేను రాసినవి ఎంతమందికి నచ్చుతాయో తెలియని పరిస్థితి. కానీ సీనియర్లందరూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. నేను గత పాతిక ముఫ్ఫై సంవత్సరాలుగా సేకరించి దాచుకున్న విశేషాలనే అందిస్తున్నానని వాళ్ళందరికీ తెలుసు. కానీ గత సంవత్సరకాలంలో చాలామంది కొత్త మిత్రులు నా బ్లాగుకు రావడం ప్రారంభించారు. అందులో చాలామంది యువతరానికి చెందిన వాళ్ళవడం విశేషం. వారిని గతకాలపు విశేషాలు ఆకర్షించడం మరీ విశేషం. అందుకే వారికోసం గత సంవత్సరం నేను ఎక్కువగా ప్రముఖుల జయంతులను, వర్థంతులను... ఇంకా కొన్ని ప్రముఖ దినాలను పాటిస్తూ ప్రత్యేకంగా రాయడం ప్రారంభించాను. దీనివలన వారి లేదా ఆ తేదీల విశిష్టత ఇప్పటి యువతరానికి తెలియడమే కాదు.... ఆ సందర్భాలను వారు గుర్తు పెట్టుకునేలా చెయ్యడానికి వీలవుతుందని నా భావన ! ఈ సంవత్సరం ఒక క్రొత్త ప్రయోగం ప్రారంభిస్తున్నాను. ఆ వివరాలు చివరిలో.....
నేను పుట్టిన హిందూ మతాన్ని, సంప్రదాయాల్ని నేనెంతో ప్రేమిస్తాను. అలాగే ఇతర మతాల్ని, వారి విశ్వాసాల్ని కూడా గౌరవిస్తాను. అది నాకు ఎలా అలవడిందో తెలియదు గానీ చిన్నప్పటినుంచీ అలవడింది. అలాగే కులం గురించి మాట్లాడటమంటే నాకు చాలా ఇబ్బందిగా వుంటుంది. ఎందుకంటే అన్ని కులాల్లోను, మతాలలోను నన్ను అభిమానించే, ప్రేమించే మిత్రులున్నారు.
అన్నిటికంటే నేను పుట్టిన గడ్డ భారతదేశం ఆంటే చాలా చాలా ఇష్టం. ఇతర దేశాల గురించి తెలుసుకోవడం కూడా ఇష్టమే ! తెలుగు భాష ఆంటే మహా ప్రీతి. ఇతర భాషలను గౌరవించడం కూడా ఇష్టమే !
బీడుగా పడి వున్న లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్ దొర ఆంటే ఇష్టం.
తెలుగుకు వెలుగు ప్రసాదించిన బ్రౌన్ దొర ఆంటే చాలా ఇష్టం.
వాళ్ళు తమ దేశాన్ని, భాషను మాత్రమే గౌరవించి మన దేశాన్ని, భాషను నిర్లక్ష్యం చేసి వుంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి. చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళేటప్పుడు రోడ్ మీద కొన్ని ఆకర్షణలు కనిపించేవి. మోళీ సాహెబ్ ఆటలు, గారడీలు, సినిమా బళ్ళు, సర్కస్ వచ్చినప్పుడు ఏనుగులు, ఒంటెలు వగైరాలతో జరిపే ఊరేగింపులు లాంటివి. అలాగే రోడ్ నే కాన్వాస్ గా చేసుకుని బొగ్గుముక్కలతో అందమైన బొమ్మలు గీసే చిత్రకారులు కూడా ! ఇలాంటివి కనబడినప్పుడు అక్కడే నిలబడి తదేకంగా తన్మయత్వంతో చూసి క్లాసుకి ఆలస్యంగా వెళ్లి టీచర్ల చేత చీవాట్లు తిన్న సందర్భాలెన్నో వున్నాయి. కళలన్నా, కళాకారులన్నా అంత మక్కువ. కళాకారుడెవరు ? ఏ స్థాయి వాడు ? ఏ మతస్థుడు ? ఏ కులస్థుడు ? అన్న ఆలోచన లేదు.... రాదు.... అప్పటికీ... ఇప్పటికీ... వారి కళ మాత్రమే కనిపించేది.
మా ఇంట్లో వున్న ఖరీదైన పటంలోని రవివర్మ గీసిన దేవుడి బొమ్మ చూసినా, రోడ్ మీద బొగ్గులతో గీసిన దేవుడి బొమ్మ చూసినా ఒకే రకమైన ఆనందం కలిగేది. త్యాగరాయ గాన సభలో వెంపటి చినసత్యం గారి బృందం చేసిన నాట్యం చూసి ఎంత ఆనందం పొందేవాడినో... మోళీ సాహెబ్ వాయించే డోలక్ కి అనుగుణంగా చేసే అమ్మాయి నృత్యం చూసినా అంతే ఆనందం పొందేవాడిని. ఇంకా చెప్పాలంటే నవరాత్రి పందిళ్ళలో మేజువాణీలు, రికార్డింగ్ డాన్సులను కూడా ఒక స్థాయి వరకూ చూసి ఆనందించేవాడిని. బాలమురళి కచేరీ నన్ను ఎంత మురిపించేదో, రైల్లో చిడతలు వాయిస్తూ.. అమ్మాయి చేయి పట్టుకుని నడుస్తూ... అడుక్కునే గుడ్డివాని పాట విన్నా అలాంటి అనుభూతే కలిగేది. ఇలాంటి పోలికలు చెబితే ఎవరికైనా కోపం రావచ్చేమోగానీ ఇది నిజంగా నిజం. నా రసాస్వాదన స్థాయిని చెప్పడానికే ఇది చెప్పవలసి వచ్చింది. ఇదేదో గొప్ప విషయం అని నేననుకోవడం లేదు. చాలామందిలో ఇలాంటి స్థితే ఉండొచ్చు. అయితే అందరూ బహిరంగంగా చెప్పుకోకపోవచ్చు. ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్పుకున్నాను. గత రెండేళ్లలో నన్ను బాధపెట్టిన ఒకే ఒక వ్యాఖ్య... ఆ సందర్భం. పంటికింద రాయిలా బాధ పెట్టిన కారణంగా ఈ వార్షిక నివేదికలో ఒకసారి తలచుకోకుండా ఉండలేకపోయాను. అంతేకానీ ఇంకా పొడిగించడానికి కాదు. ఇక మిగిలిన అందరూ నా రాతల్ని విశ్లేషిస్తూ, ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు రాసిన వారే ! వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం నా బాధ్యత.
ఇక గతసంవత్సరపు గణాంకాలలోకి వెడితే.....
రాసిన మొత్తం టపాలు ( అనుబంధాలతో కూడా కలిపి ) - 734
గతసంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు - 358
గతసంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు - 358
వచ్చిన మొత్తం వ్యాఖ్యలు - 2141
గతసంవత్సర కాలంలో వచ్చిన వ్యాఖ్యలు
( టపాలతో సంబంధం లేనివి, నా జవాబులు,
రిపీట్ అయినవి కాక ) - 1097
శిరాకదంబం అభిమాన మిత్రులుగా చేరినవారు, మొత్తం - 73
గతసంవత్సర కాలంలో చేరిన వారు - 53
గతసంవత్సర కాలంలో చేరిన వారు - 53
శిరాకదంబం మొత్తం సందర్శకులు
( 14 వ తేదీ 00.00 గం. వరకూ ) - 1 ,16 , 450
గతసంవత్సర కాలంలో సందర్శకులు - 95 , 522
గతసంవత్సర కాలంలో సందర్శకులు - 95 , 522
ఈ సంవత్సరకాలంలో ఇంతగా అభివృద్ధి , సాధించడానికి తోడ్పడిన మిత్రులు, అభిమానులు, అగ్రిగేటర్లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు... అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకుంటూ... ఒక విన్నపం.
ఈ రెండు సంవత్సరాల మీ ఆదరాభిమానాలను పురస్కరించుకుని శిరాకదంబం ని ఒక ప్రయోజనకరమైన వెబ్ పత్రికగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈరోజు నుంచి మీకు అందిస్తున్నాను. దీనికి కొందరు అంతర్జాల మిత్రులు ప్రోత్సాహం, సహకారం అందించడానికి ముందుకు రావడం చాలా ఆనందదాయకం. దీన్ని ఆడియో వీడియో పత్రికగా రూపొందించాలని ప్రయత్నం. శిరాకదంబం వెబ్ పత్రికను కూడా ఆదరించి, ఆ పత్రిక అభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు అందిస్తారని ఆశిస్తూ... పత్రిక లింక్....
ఒక్కసారి పై లింక్ నొక్కి పత్రికలో అడుగు పెట్టి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుకుంటూ.... వందన కదంబాలు.
చివరగా రెండు సంవత్సరాలు పూర్తి అవడానికి కొద్దిసేపటి ముందు ( 13 వ తేదీ 8:50 PM ) ఒక క్రొత్త అభిమాని మెయిల్ లోవ్యక్తపరచిన అభిప్రాయం...
Dear sir,
ఇవ్వాళంతా మీ బ్లాగులోనే గడిపాను. చదివి చదివి ఆనందించడం లో మునిగి పోయాను.
మీకా మాట చెప్పాలని వాఖ్యలో వ్రాద్దామనుకున్నా కానీ ,
దేనికని వ్రాయను, అన్నీ బాగుంటే,
మళ్ళీ అనుమానమొచ్చింది, దేనికైనా వాఖ్య వ్రాసే స్థాయి నాకుందా అని .
Thank you sir,
for creating a good blog
Chandu. S
ఇవ్వాళంతా మీ బ్లాగులోనే గడిపాను. చదివి చదివి ఆనందించడం లో మునిగి పోయాను.
మీకా మాట చెప్పాలని వాఖ్యలో వ్రాద్దామనుకున్నా కానీ ,
దేనికని వ్రాయను, అన్నీ బాగుంటే,
మళ్ళీ అనుమానమొచ్చింది, దేనికైనా వాఖ్య వ్రాసే స్థాయి నాకుందా అని .
Thank you sir,
for creating a good blog
Chandu. S
Vol. No. 03 Pub. No. 001
26 comments:
రావుగారూ, మరు మరెన్నో మైలు రాళ్ళను అధిగమించాలని ఆకాంక్షిస్తూ...అభినందనలు.
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు
SRRao గారు
రెండవ వార్షికోత్సవ అభినందనలు మరియు శుభాకాంక్షలు బాబాయ్... మీరు ఇలాగే మరెన్నో మైలురాళ్ళను అవలీలగా అధిగమించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
రావు గారూ మీ బ్లాగు రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు.
మీ సిరాకదంబం పత్రిక తెరిచి చూద్దామంటే తెరుచుకోవటం లేదండి. The URL is not valid and cannot be loaded అని వస్తుంది. మీరిచ్చిన URL తప్పంటారా?
మీరు ఇచ్చిన లింకు ద్వారా ఓపెన్ అవటం లేదు కానీ మాములుగా బాగానే ఓపెన్ అవుతుంది. మీ బ్లాగులో లింకు తప్పుగా ఇచ్చినట్లున్నారు..ఒకసారి చూడండి.
balance sheet తో పాటు, షేర్ వేల్యూ, eps, P/E కూడా వెయ్యండి స:-)
రావు గారు లింక్లో స్పేస్ ఇచ్చారు. చివరన స్పేస్ డిలీట్ చేస్తే ఓపెన్ అవుతుంది.
మన సాహితీవేత్తలు, పెద్దలు అందరి మీద మోనోగ్రాఫ్ లు ఉంటే బాగుండునని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవుల మంజులత గారు చెప్పినప్పుడు అనిపించింది. ఆ పని మీరు చేస్తున్నారంటే చాలా సంతోషంగానూ ఎంతో గర్వంగానూ ఉంది. మీరు చేపట్టిన కార్యం ఎంతో ప్రశంసనీయం. మీ శిరాకదంబం లో 'సిరా' ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలని, 'ఇంకు' ఇంకిపోరాదనీ ఆ సరస్వతీ దేవిని మనఃస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదాలు
రావు గారు.. బ్లాగ్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు... మీకు శుభాభివందనలు. ప్రతి రోజు మీ బ్లాగ్ సందర్శించ కుండా నేను ఉండను.వినోదం,విజ్ఞానం..ఆసక్తి .. ఆలోచన..అన్నీ అలరిస్తాయి. మంచి విషయాలు పంచుతున్నందుకు ధన్యవాదములు. ..
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు .
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రావు గారు..
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు .
బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు
రావు గారు, మీరు సాధించిన కృషికి హృదయపూర్వక అభినందనలు. ఇంకా నిన్నా మొన్నటిలాగానే అనిపిస్తుంది. మీ వెబ్ పత్రికకు శుభాకాంక్షలు.
మీకు రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు
* తృష్ణ గారూ !
* రాజి గారూ !
* శోభమ్మా !
* సాధారణ పౌరుడు గారూ !
* Varsha Bhargavi గారూ !
* వనజ వనమాలి గారూ !
* మాలా కుమార్ గారూ !
* రవికిరణ్ గారూ !
* లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !
* జ్యోతి గారూ !
* జయ గారూ !
మీ అందరి ఆదరాభిమానాలతోనే ముందుకు సాగుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.
* సిరిసిరిమువ్వ గారూ !
లింక్ సమస్య గురించి తెలిపినందుకు, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. సరిచేసాను.
* ప్రవీణ్ శర్మ గారూ !
లింక్ విషయంలో మీరిచ్చిన సలహాకు ధన్యవాదాలు. సరిచెసాను.
Congrats Ramachandrarao garu.Chaalaa aasaktikaramgaa nirvahistunnaru
మీ బ్లాగ్ చాలా బాగుంది. రెండు సంవత్సరములు చాలా గొప్పగా గడిచినందుకు, అభినందనలు. మీ బ్లాగ్ ఇలాగే అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ.
* కృష్ణప్రియ గారూ !
* సుధామ గారూ !
* శ్రీనివాసులు గారూ !
మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు.
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు SRR గారూ
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
బాగుందండి. వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు.
* బాల సుబ్రహ్మణ్యం గారూ !
* శిశర గారూ !
ధన్యవాదాలు.
meeku ma subhakankshalu
* చిన్ని గారూ !
ధన్యవాదాలు.
శిరాకదంబం రెండవ పుట్టినరోజు సందర్భంగా హార్థిక అభినందనలు,శుభాకాంక్షలు
శ్రీదేవి మురళీధర్
శ్రీదేవి గారూ !
ధన్యవాదాలు
Post a Comment