యేను తెలుగువల్లభుండ అని స్వయంగా చెప్పుకున్న చక్రవర్తి కృష్ణదేవరాయలు
అఖండ విజయనగర సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించి చరిత్రలో నిలిచాడు
తాను చెప్పుకోకపోయినా మనకి మరో తెలుగు వల్లభుడు ఘంటసాల
తెలుగు ప్రజల హృదయసామ్రాజ్యాన్ని నిరాటంకంగా ఇప్పటికీ ఏలుతూనే వున్నాడు
కృష్ణదేవరాయలు సాహిత్యలక్ష్మిని అభిమానిస్తే
ఈ గాన వల్లభుడు సంగీతలక్ష్మిని ఆరాధించాడు
తెలుగు సంగీతాన్ని అందని శిఖరాలకు చేర్చాడు
తెలుగు వారందర్నీ అలరించాడు... అలరిస్తున్నాడు....అలరిస్తాడు
ఏ సామ్రాజ్యంలోనైనా చక్రవర్తి మరణంతో ఖాళీ అయిన సింహాసనాన్ని మరొకరు అధిష్టిస్తారు
మూడున్నర దశాబ్దాల క్రితం ఖాళీ అయిన తెలుగు గాన సింహాసనాన్ని ఎవరైనా అధిష్టించగలిగారా ? ఇకముందైనా అదిష్టించగలరా ?
ప్రపంచంలో ఘంటసాలగారి కంటే ఎక్కువ పాటలు పాడిన వాళ్ళుండవచ్చు
మరణానంతరం ఆయన కంటే ఎక్కువకాలం తమ గానంతో సజీవంగా వున్న వాళ్ళుండవచ్చు
కానీ తెలుగు జాతి వున్నంతకాలం ఆయన తన గానంతో సజీవంగానే వుంటారు
ఆయనది గతించిన తరం కాదు...... అది నిరం'తరం'
తెలుగు భాషకు అలంకారం పద్యం
తెలుగు దేశానికి అలంకారం ఘంటసాల
తెలుగు ప్రజలకు ఆయన దూరం కాలేదు
తెలుగు భాష ఉన్నంతవరకు ఆయన వుంటారు
గాన సామ్రాజ్య సామ్రాట్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆయన పాడిన పద్యాలతో కూర్చిన నీరాజనం ...........
ఘంటసాల గారిపై గతంలో రాసిన టపాల లింకులు
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_04.html
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_1328.html
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_11.html
Vol. No. 02 Pub. No. 074
8 comments:
ఆయనది గతించిన తరం కాదు...... అది నిరం'తరం'-ఆయనది గతించిన "గళం" కాదు ..అది నిరంతరం"అనర్గళం"..అని రాశి ఉంటె బాగుండేది.
రావు గారు, బాగా రాశారు మాస్టారిగురించి. అయితే ఆ మహామహునికి అతనే సాటి. ఆ లోటును వేరెవ్వరూ భర్తీ చేయలేరు. సమాంతరంగా నాభావాలకు ఇచ్చినరూపం నా 'స్వగతం' లో చూడండి.
http://vulimiri.blogspot.com/2010/12/blog-post.html
* astrojoyd గారూ !
ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమే ! కానీ ఇటీవల కొంతమంది ఘంటసాల గారిని గత తరం గాయకుడుగా పేర్కోవడం జరుగుతోంది. అందుకని అలా రాసాను.
* స్వగతం గారూ !
ధన్యవాదాలు. మీరు రాసింది కూడా చదివాను.
నందమూరిని గాంచగ పొందు హాయి,
ఘంటసాలను వినినంత గలుగునోయి!!!
తెలుగు సీమలో పుట్టిన తేజమయుల
తరలి రమ్మందు నొకసారి మరల తిరిగి!!!
(మీ బ్లాగులో మీరుంచిన పద్యాలను వినుకుంటూ వ్రాసిన పద్యం )
ghantasala ninnati gayakude kaadu.nedoo- raaaboye taraanikee koodaa aayana- aayana paata-chirasmaraneeyaalu.
* పీతాంబార్ గారూ !
మీ ఆకాంక్షే నాది కూడా ! ధన్యవాదాలు.
* సుబ్బారావు గారూ !
మీరు చెప్పింది నిజం. ధన్యవాదాలు.
చాలా మంచి టపా అందించారు. వీనుల విందుగా ఉంది.ఘంటసాల గత తరం గాయకుడు అను కోవడంలో కించ పడడానికి ఏమీ లేదనుకుంటాను. క్వచిత్తుగా తప్ప వీనుల విందయిన పాటలు వినిపించని ఈ రోజుల్లో ఆ కమనీయ గాత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు ? అనుకోవడం అనివార్యమే అవుతోంది, కదా.
జోగారావు గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఎందుకో ఘంటసాల గారు లేరు అని అనుకోలేకపోతున్నాను. ఆయన పాటల్లో ఆయన సజీవంగా ఉన్నట్లే భావిస్తాను. ఇప్పటి పాటల్లో ఎన్ని మార్పులు వచ్చినా ఆయన గానాన్ని ఇప్పటితరం కూడా విని ఆనందిస్తోంది. ముందు తరాలు కూడా ఆనందిస్తాయని నమ్ముతాను. అందుకే ఆయన ' గత తరం గాయకుడు ' అన్నది ఊహించలేకపోతున్నాను.
Post a Comment