Wednesday, August 10, 2011

జోహార్లు జోహార్లు జోహార్లు


జోహార్లు జోహార్లు జోహార్లు 
అమరవీరులార మీకు జోహార్లు

స్వాతంత్ర్య రథమ్మునెక్కి  సమరవీధులందుదోలి 
అతివాద శరములు గురిపె అసువులపై నాసవదలి
 ప్రళయకాల రుద్రులయి ప్రజలదాస్య మడుగంటగ
వీరశూరతనము మెరయ ధీరులు ఉరికంబమెక్కి
స్వరక్తధారలన్ గురిపె స్వాతంత్ర్య బీజములు నాటి
వీర స్వర్గవాసులైన విప్లవయోధులకు నిత్య 
జోహార్లు జోహార్లు జోహార్లు 
అమరవీరులార మీకు జోహార్లు

ఫలించని ఆశతో జ్వలించెడి గుండెలతో 
కార్యదీక్ష మరువకుండ కదనసీమ విడువకుండ
అన్యాయము నరికట్టుచు అంతిమ ప్రాణం వరకును 
సంఘర్షణ సాగనిచ్చి సమధర్మ నినాదమిచ్చి 
ముగింపకుడి విప్లవమని మిగిలిన పని మీవంతని 
 అంతిమ విజయం మనదని అమరవీరులైనోరికి  
జోహార్లు జోహార్లు జోహార్లు  
అమరవీరులార మీకు జోహార్లు

- సుద్దాల హనుమంతు 
 
 " స్వాతంత్ర్యం వచ్చింది. దేశం మనదైంది..... అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించలేం ! ఇపుడే మనం మరింత క్రమశిక్షణతో, నిగ్రహంతో ప్రవర్తించాలి. అన్యోన్య సౌహార్డామృతంతో భారతావనిని అగ్రగామిగా చేయాలి "
                                                                 - గాంధీ మహాత్ముడు       

Vol. No. 02 Pub. No. 312

2 comments:

Radha Rav said...

svatantram vachhi 60 samvatsaarainaa manalo aikamatyam maree takkuva ayipotondani anipistondi! ...oke bhaasha vaaramaina teluguvaarilo praanteeyata inta asambhardhangaa satruvulla chuusukovatam lo inke desam lo ituvanti bhaadaakaramaina paristhiti undadu!. endukinta pramaadakaramaina sthithilo vasthunnamo badhaakaram gaa anipistuundi. veru veru bhaashala vairudhyam undane undi...inka mata tatvam kula vibhedaaluu ekkuvaipotunnayi!. mana desaaniki sarihaddullo unna satruvulaku ide mana meeda debba teeyataaniki maname vaariki sahaaham chestunnamu... vichhinakara anbtar satrutvam tone mana desam videseeyula kinda baanisalayyamu!.. tirigee desaaniki muppu vastundemo ani vishaada karamanipistundi!.

SRRao said...

రాధా గారూ !

ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం