This feature is powered by Dishant.com - Home of Indian Music ' తెలుగు వీర లేవరా ' ఈ పాటకు మహాకవి శ్రీశ్రీ కి జాతీయ అవార్డు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ! అవార్డు క్రింద మొదట పదివేల రూపాయలు ప్రకటించటం జరిగింది. తర్వాత అది ఐదు వేలకు తగ్గించారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలి అహమ్మద్ ఆ అవార్డును శ్రీశ్రీ కి ప్రదానం చేసారు. పారితోషికం కవరులో పెట్టి ఇచ్చారు. తర్వాత చూస్తే అందులో ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు విలువ చేసే 5 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఒకసారి శ్రీశ్రీ గారికి డబ్బు అవసరమై వాటిని స్టేట్ బ్యాంకు లో తాకట్టు పెట్టి మూడువేల రూపాయిలు తీసుకున్నారు. తర్వాత ఆ విషయం మరచిపోయారు. ఐదేళ్ళ తరువాత బ్యాంకు వాళ్ళు అసలు, వడ్డీ కలిపి పదివేల రూపాయలు కట్టమని నోటిసు పంపారు. అప్పుడు గుర్తుకొచ్చి కంగారు పడ్డ శ్రీశ్రీ అది తీర్చడానికి మళ్ళీ అప్పు చెయ్యాల్సివచ్చింది. అలా అందర్నీ అలరించిన ఆ పాట ఆయన్ని మాత్రం అప్పులపాలు చేసింది. |
Tuesday, November 3, 2009
శ్రీశ్రీ ని అప్పులుపాలుచేసిన అవార్డు
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
No comments:
Post a Comment