Tuesday, November 17, 2009

శ్రీశ్రీ శ్లేషలు- 2

భాష మీద పట్టున్న వాళ్లకు మాత్రమే ఛలోక్తులు విసరడం, చురకలు వెయ్యడం, మామూలుగా మాట్లాడే మాటల్నికూడా శ్లేషలుగా మార్చడం సాధ్యమవుతుంది. మహాకవి శ్రీశ్రీ అందులో దిట్ట.
గతంలో ఆయన శ్లేషలు కొన్ని ఇచ్చాను. ఇప్పుడు మరికొన్ని............

* కాకినాడలో సన్మాన సభ జరుగుతోంది. అందులో మాట్లాడుతూ శ్రీశ్రీ
" నన్ను మొట్టమొదట 'అచ్చేసి' దేశం మీదకు వదిలింది పురిపండావారు " అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీశ్రీ గారి మొదటి కావ్యం ' ప్రభవ ' ప్రచురించింది ప్రముఖ రచయిత పురిపండా అప్పలస్వామి గారు.

* అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో మద్యపానం పైన నిషేధం విధించింది. దాని మీద శ్రీశ్రీ గారి విసుర్లు చూడండి.
" కాంగ్రెస్ వాళ్లు ఏదో పొడిచేస్తామన్నారు. కానీ ' తడి ' గా ఉన్న రాష్ట్రాలను కూడా ' పొడి ' గా చేసేసారు "

* కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి, శ్రీశ్రీ గారికి ఎప్పుడూ చుక్కెదురే ! విశ్వనాథ వారికి కొంచెం అహం పాలెక్కువ. ఆయనోసారి ఓ సందర్భంలో " నా అంతటి మహాకవి మరో వెయ్యేళ్ళ వరకూ పుట్టడు " అన్నారు. దీనికి సమాధానంగా శ్రీశ్రీ " నిజమే స్వామీ ! మీరు వెయ్యేళ్ళ క్రితమే పుట్టి ఇప్పుడు మమ్మల్ని బాధ పెడుతున్నారు " అన్నారు.

Vol. No. 01 Pub. No. 109

3 comments:

Vasu said...

బావున్నాయి

sreenika said...

చాలా బాగున్నాయండి.
వివిధ రంగాల్లో మీరు చేస్తున్న టపాలు చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ' చలనచిత్ర విశేషాలు ' తెరముందున్న మాకు తెరవెనుక విషయాలు చలా ఆశక్తిదాయకంగా తెలియచేస్తున్నారు. ధన్యవాదములు.

SRRao said...

వాసు గారూ !
శ్రీనిక గారూ !
ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం ఉంటే నా దగ్గర ఉన్న విశేషాలన్నీ అందించడానికి ప్రయత్నిస్తాను. నేను అన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకునే పనిలో ఉన్నాను. నాతోబాటు అందరికీ అందిస్తే బాగుంటుందనిపించింది. అలాగే తప్పులేమైనా దొర్లినా మిత్రులు సరిజేసే అవకాశం ఉంది కదా ! అయితే ఇవి ఎంతమందికి నచ్చుతున్నాయో తెలియదు.
అప్పుడప్పుడైనా మీలా మిగిలిన మిత్రులు స్పందిస్తే నేను సరైన దారిలోనే వెడుతున్నానని నమ్మకం కలుగుతుంది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం