వేణుమాధవ్ గారి శిష్యుడిగా పదిహేను సంవత్సరాల వయసులోనే మొదటి మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన శ్రీనివాస్ ది వరంగల్ జిల్లా కేసముద్రం. ధ్వన్యనుకరణ ( వెంట్రిలాక్విజం ) ను చెన్నై లోని ప్రొ. ఎమ్. ఎమ్. రాయ్ గారి వద్ద నేర్చుకుని, అమెరికా లోని కొలరాడో లోని మహేర్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ వెంట్రిలాక్విస్ట్స్ నుంచి పట్టా పొందారు.
మనదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎన్నో నగరాల్లో ప్రదర్శనలిచ్చిన శ్రీనివాస్ తెలుగుతో బాటు, హిందీ, ఇంగ్లీష్ , ఉర్దూ, తమిళం భాషలలో కూడా ప్రదర్శనలు నిర్వహించగలరు. 1990 లో హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభ లో ' ధ్వన్యావధానం ' అనే నూతన ప్రక్రియను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. అదే సంవత్సరం అదే చోట 32 గంటల నిర్విరామ మిమిక్రీ ప్రదర్శన యిచ్చి రికార్డు సృష్టించారు. సాధారణంగా మనం చూసే మిమిక్రీ అంశాలకు భిన్నంగా అనేక మిమిక్రీ, ధ్వన్యనుకరణ ప్రక్రియలను కనుగొన్నారు. వాటిలో స్వరాన్ని విసరడం ( Voice throwing ), శబ్దభ్రాంతి ( Sound illusion ), శబ్దదర్శనం ( Sound Perspective), వ్యంగ్యచిత్ర భ్రాంతి ( Caricature Illusion ) వంటి ఎన్నో విన్నూత్న ప్రక్రియలకు శ్రీకారం చుట్టి మిమిక్రీ కళకు మరింత వన్నె తెచ్చారు.
తెలుగువారి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో వ్యాపింపజేస్తున్న ప్రియమిత్రుడు మిమిక్రీ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ... ఇప్పటికే ముఫ్ఫై మూడు ఏళ్ళుగా ఆరువేల ప్రదర్శనలపైన ఇచ్చిన ఆయన త్వరలోనే పదివేల ప్రదర్శనలను పూర్తిచెయ్యాలని కోరుకుంటూ......
03 ఫిబ్రవరి 2010 తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో మిమిక్రీ శ్రీనివాస్ ప్రదర్శించిన ' శబ్దభ్రాంతి ' ప్రదర్శన ఇక్కడ.. దీంతో బాటు మరిన్ని వీడియోలు యుట్యూబ్ లో చూడవచ్చు.
Vol. No. 02 Pub. No. 097
3 comments:
mimicry sreenivas gaaru ee madhya kaalam chesaaru kadaa
అజ్ఞాత గారూ !
మీరెవరో గానీ తొందరపడకుండా వాస్తవాలు తెలుసుకుని మరీ వ్యాఖ్యలు రాయడం మంచిదేమో ! ఇలాంటి వ్యాఖ్యలు ప్రచురించేముందు ఒకటికి రెండుసార్లు వాస్తవం నిర్థారించుకుని రాస్తే బాగుంటుంది.
ఈరోజు శ్రీనివాస్ గారి పుట్టినరోజు. పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఆయన ముందు ముందు మరిన్ని ప్రదర్శనలివ్వాలని కోరుకుంటూ...
please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.
Post a Comment