తెలుగు వారి విజయ పతాకం
విజయావారి చిత్రాల విజయం
రాయలసీమలోని ఓ కుగ్రామం ఈ విజయానికి మూలం
కడప జిల్లా పులివెందుల తాలూకా ఎద్దులయ్యగారి కొత్తపల్లి లో 1912 వ సంవత్సరంలో నాగిరెడ్డి గారి జననంతో బీజం పడింది.
తల్లిదండ్రుల, మాతామహుల పెంపకంలో వ్యవసాయపనులతో బాటు చదువు.
గాంధీజీ పిలుపుతో చదువు త్యాగం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరిక
తండ్రి గారి వ్యాపారం ఉల్లిపాయలు విదేశాలకు ఎగుమతి
అన్నగారు నరసింహారెడ్డి ( బి. ఎన్. రెడ్డి ) అప్పటికే చిత్రరంగ ప్రవేశం
తండ్రి గారి కోపానికి ఫలితం నాగిరెడ్డిగారి మద్రాస్ నగర ప్రవేశం
అన్నగారి చిత్ర నిర్మాణ సంస్థలో పబ్లిసిటీ పనుల పర్యవేక్షణ బాధ్యత
........ ఇదీ ఆయన జీవన ప్రయాణంలోని తొలి ఘట్టాలు
వాహినీ సంస్థ సిబ్బందికి హోటల్ నుంచి ఇడ్లీలు తీసుకొచ్చే పని
వందేమాతరం హీరో నాగయ్యగారిని సైకిల్ మీద స్టూడియోకి చేర్చే పని
.... ఇలా ఒకటేమిటి ? చిత్ర నిర్మాణానికి అవసరమైన అన్ని పనులు చేసి రాటుదేలారు నాగిరెడ్డి
పుట్టుకతో ఐశ్వర్యవంతుడు, యజమాని సోదరుడు అయినా పని నేర్చుకునేటపుడు పనివాడే !
చక్రపాణి గారి తోడ్పాటుతో 1947 లో పిల్లలకోసం ' చందమామ ' పత్రిక ప్రారంభించారు నాగిరెడ్డి
శారీరికంగా వయసు పెరిగినా ' చందమామ ' విషయంలో మాత్రం అందరికీ ఆ పెరుగుదల ఆగిపోయింది
పిల్లల పత్రికయినా పెద్దలకు కూడా ప్రీతిపాత్రమయింది నింగి దిగివచ్చిన ' చందమామ '
తరతరాలుగా తెలుగువారందరి మదిలోను మిగిలిన అందమైన మధురానుభూతి 'చందమామ'
కఠోర దీక్షే ఆయన్ని అడుగుపెట్టిన అన్ని రంగాలలో విజయుణ్ణి చేసింది
అర్జునుడు విజయుడై ఆయన్ని చిత్ర నిర్మాణం వైపు నడిపాడు
ఆంజనేయుడు ఆయనకు అండగా నిలిచి పతాకంపై నిలిచాడు
దానితో 1949 వ సంవత్సరంలో విజయా సంస్థ ఆవిర్భవించింది
'షావుకారు' తో మొదలుపెట్టి ఆరోగ్యకరమైన చిత్రాలెన్నిటినో అందించింది
తెలుగుదనం నిండిన చిత్రాలతో తెలుగు వారికి గర్వపడే అవకాశాన్నిచ్చింది
వ్యాపారం పేరుతో వెకిలిదనాన్ని, హింసను, ఆశ్లీలతను నింపి ఆత్మవంచన చేసుకోలేదు
అయినా విజయావారి చిత్రాలే ఇప్పటికీ వ్యాపారపరంగా విజయకేతనం ఎగుర వేస్తున్నాయి
విజయావారి చిత్రాలు మాత్రమే తెలుగువారందిరినీ ఇప్పటికీ, ఎప్పటికీ అలరించే చిత్రాలేమో !
" ప్రేక్షకులకు వినోదంతో బాటు, మంచి విలువలను కూడా అందించాలన్నదే నా తాపత్రయం "
అనుకోగలిగిన నాగిరెడ్డి గారి లాంటి నిర్మాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దొరుకుతాడా ?
అందరాని ' చందమామ ' ను మనందరికీ అందించి తరతరాలుగా అలరించిన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి లాంటి ప్రచురణకర్త మళ్ళీ తెలుగు పాఠకులకు దొరుకుతాడా ?
తెలుగు వారి ' విజయా చందమామ ' నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి
గత సంవత్సరం జన్మదిన సందర్భంగా నాగిరెడ్డి గారిపై రూపొందించిన చిత్ర నీరాజనం ఈ క్రింది లింక్ లో ..................
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_02.html
అనుబంధం :
విజయావారి చందమామ గురించి మాధురి గారు అందజేసిన సమాచారం -
విజయావారి చిత్రాల్లో తప్పనిసరిగా కనిపించే చందమామ అంత అందంగా ఎలాకనబడుతుందో అప్పట్లో అందరికీ మిస్టరీగా ఉండేది. కళాధర్ గారి కళా నైపుణ్యం, మార్కస్ బార్ట్లే గారి చాయాగ్రహణ ప్రతిభకు నిదర్శనం విజయావారి చందమామ. ఆ చందమామ వెనుక రహస్యాన్ని తెలుసుకోవడానికి అప్పట్లో అమెరికా నుండి కొంతమంది ప్రత్యేకంగా వచ్చినట్లు కళాధర్ గారు చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే కొన్ని విషయాలు మరుగున పడినా ఇలా మాధురిగారి లాంటి వారి పరిశోధన వలన బయిట కొస్తే చరిత్రకెక్కుతాయి. భవిష్యత్తు తరాలకు ఈ సంపద చేరుతుంది.
Vol. No. 02 Pub. No. 072
5 comments:
All of you know that Vijaya's chandamama, in films, was very beautiful.Last month when I went to meet Kalaadhar garu, art director, 95, he said that in those days somebody had come from the USA only to find out why and how their chandamama, was so beautiful and natural.
నాగి రెడ్డి గారిపై మీ గత సంవత్సరం కూర్పు చాలా బాగుంది. విజయా వారిని తలుచుకుంటే అదో త్రుప్తి. ఆ జీవితాలు ఆకాలపు జీవితాల్లో పెనపెసుకున్నాయి కదా. లింక్ ఇచ్చి నందుకు థాంక్స్.
vijayavari 'chandamama'pillalane kaaadu- peddalanoo- alarinchedi.andulo- kathaloo-vaaatiki chitraalu- shankar-chitra vesinavi- chandamama kanthulani- challadanaanni adhikatamam chesevi ante atisayokthi kaadu.palanki venkata ramachandra murthy garu tana rachanaamrutaanni tana kathalalo volikinchaaru- alaage marendaro anduloni rachayitalu.
విజయా వారి గురించి రాసిన మీ పోస్ట్ చాలా బావుంది. చందమామ చదవని పిల్లలుంటారంటే నేను అస్సలు నమ్మను. మా పిల్లలకి కూడా ఇండియా నుండి తెప్పించి చదువుతాము అప్పుడప్పుడు. ఎన్నో మధురస్మ్రుతులను కదిలించారు మీ పోస్ట్ తో, ధ్యన్యవాదాలు.
* మాధురి గారూ !
మంచి సమాచారమిచ్చారు. ధన్యవాదాలు. ఈ సమాచారాన్ని టపాలో చేరుస్తున్నాను.
* రావు గారూ !
* సుశీ గారూ !
* దుర్గ గారూ !
ధన్యవాదాలు
Post a Comment