ఓసారి రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో ఓ సాహిత్య సభ జరుగుతోంది. ముఖ్య అతిధులందర్నీ వేదికపైకి ఆహ్వానించారు నిర్వాహకులు. పెద్దలందరూ ఒక్కొక్కరుగా వేదికనలంకరించారు. అంతా కూర్చున్నాక ప్రార్థన మొదలవుతుందని ప్రకటించారు. అప్పుడు గమనించారు మహామహోపాధ్యాయ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు...... ఆ వేదిక మీద మరో ప్రముఖ రచయిత ఆర్. ఎస్. సుదర్శనం గారు లేరని. ఆయన వేదిక క్రిందనే వుండి పోయారు. వేదిక మీదకు అతిథుల్ని ఆహ్వానించిన పెద్దమనిషి పొరబాటున సుదర్శనం గారి పేరు పిలవడం మరచిపోయాడు.
అప్పుడు నిర్వాహకులు ఆయన దగ్గరికి వెళ్ళి తమ తప్పు మన్నించమని, వేదికనలంకరించమని కోరినా ఆయన మొహమాటపడిపోతూ ' ఫర్వాలేదు లెండి. మీరు సభ నడిపించండి ' అంటూ క్రిందనే వుండిపోయారు. ఇది గమనించిన మధునాపంతుల వారు లేచి కలగజేసుకుని " ప్రార్థనకు ముందు మరో ప్రార్థన. సుదర్శనంగారిని వేదికనలంకరించమని ప్రార్థన " అనగానే సుదర్శనం గారు ఇక తప్పదనుకుని చిన్నగా నవ్వుకుంటూ వేదికనెక్కారు.
Vol. No. 02 Pub. No. 291
7 comments:
మీ కొత్త పోస్ట్ ప్రార్థన ముందు ప్రార్థన ఇప్పుడే చదివాను.బావుంది.
baagundi ramachandra rao gaaru !!
మధునాపంతుల వారి గురించి మీరు వ్రాసినది చదివాను.చాలా బాగుందండీ.అభినందనలు.
వారి స్మృతులు కొన్ని నా మనసులో మెదులుతున్నాయి.
డెబ్బయ్ దశకంలో -నేను ధవళేశ్వరం లో పని చేస్తున్నప్పుడు - అక్కడికి వచ్చిన మిత్రులు డాక్టర్ సి .నారాయణ రెడ్డి గారు శ్రీ మధునాపంతుల వారిని కలుద్దామని ఉంది అని అంటే -వారిని రాజమండ్రి లో కుమారి టాకీస్ దగ్గర ఉన్న శాస్త్రి గారి ఇంటికి ఒకసారి నేను తీసుకువెళ్ళాను. అతి దగ్గర గ ఉండి, ఇద్దరు సాహితీ మూర్తులు -విషయ చర్చ ఎలా చేసుకుంటారో- ఒకరినొకరు ఎంతగౌరవం గా -ఆప్యాయంగా పలకరించుకుంటారో ప్రత్యక్షం గా చూసాను.అది నా అదృష్టం !
అంతకు ముందే - శ్రీ మధునాపంతులవారితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. వారిని- మేము నిర్వహించే ' సాహితీ సదస్సుకు' ఆహ్వానించగా వారు- నిండు మనసు తో వచ్చి -చక్కటి 'ప్రవచనం' చేసారు. మేము మా లిఖిత పత్రిక కు వారే 'ఆనంద' అని నామకరణం చేసి- అందులో తొలి పేజీ ని వారి కవిత తో అలంకరించాము .ఆ 'కవితాక్షలతో ' వారు పత్రికనూ- మమ్మల్ని ఆశీర్వదించారు.వారి చేతుల మీదుగా ఆ నాడు ఆ పత్రిక ఆవిష్కరణ జరిగింది.
మిత్రమా -ఆ నాటి అనుభూతి కి 'తెర ' తీసారు- మీ రచనతో- - కృతజ్ఞతలు-
మధునాపంతుల వారి గురించి వ్రాసినది చదివాను.చాలా బాగుందండీ.అభినందనలు.
వారి స్మృతులు కొన్ని నా మనసులో మెదులుతున్నాయి.
డెబ్బయ్ దశకంలో -నేను ధవళేశ్వరం లో పని చేస్తున్నప్పుడు - అక్కడికి వచ్చిన మిత్రులు డాక్టర్ సి .నారాయణ రెడ్డి గారు శ్రీ మధునాపంతుల వారిని కలుద్దామని ఉంది అని అంటే -వారిని రాజమండ్రి లో కుమారి టాకీస్ దగ్గర ఉన్న శాస్త్రి గారి ఇంటికి ఒకసారి నేను తీసుకువెళ్ళాను. అతి దగ్గర గ ఉండి, ఇద్దరు సాహితీ మూర్తులు -విషయ చర్చ ఎలా చేసుకుంటారో- ఒకరినొకరు ఎంతగౌరవం గా -ఆప్యాయంగా పలకరించుకుంటారో ప్రత్యక్షం గా చూసాను.అది నా అదృష్టం !
అంతకు ముందే - శ్రీ మధునాపంతులవారితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. వారిని- మేము నిర్వహించే ' సాహితీ సదస్సుకు' ఆహ్వానించగా వారు- నిండు మనసు తో వచ్చి -చక్కటి 'ప్రవచనం' చేసారు. మేము మా లిఖిత పత్రిక కు వారే 'ఆనంద' అని నామకరణం చేసి- అందులో తొలి పేజీ ని వారి కవిత తో అలంకరించాము .ఆ 'కవితాక్షలతో ' వారు పత్రికనూ- మమ్మల్ని ఆశీర్వదించారు.వారి చేతుల మీదుగా ఆ నాడు ఆ పత్రిక ఆవిష్కరణ జరిగింది.
మిత్రమా -ఆ నాటి అనుభూతి కి 'తెర ' తీసారు- మీ రచనతో- - కృతజ్ఞతలు
* కృష్ణవేణి గారూ !
* కంది రవి గారూ !
ధన్యవాదాలు
* సుబ్బారావు గారూ !
మీవంటి పెద్దవారు, అనుభవజ్ఞులు ఇలా తమ అనుభవాలను, అనుభూతులను జోడిస్తే నా రాతలు మరింత సంపన్నం అవుతాయి. అది నా భాగ్యం. మీకు అనేక కృతజ్ఞతలు.
చాలా బాగుంది రామచంద్ర రావు గారు. సుబ్బారావు గారు తమ స్వీయానుభావాన్ని తెలియజేసి మరింతగా ఆనందింప జేసేరు.
జయలక్ష్మీ గారూ !
చాలా సంతోషం మీరు నా బ్లాగుకు విచ్చేసినందుకు. చాలా చాలా ధన్యవాదాలు.
Post a Comment