భారత చలన చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకోగలిగిన గాయకుడు మహమ్మద్ రఫీ.
భారత చలన చిత్ర చరిత్రలో ఆయనదొక అథ్యాయం. పంజాబ్ లో అమృత్ సర్ కు దగ్గరలోని గ్రామంలో పుట్టి అక్కడ ఫకీర్ ని అనుకరిస్తూ తత్వాలు పాడుతూ తన గానకళను ప్రదర్శించి తండ్రితో లాహోర్ వలస వెళ్ళి చివరి మజిలీగా బొంబాయి చేరిన రఫీ బడే గులాం ఆలీఖాన్ లాంటి ప్రముఖుల దగ్గర సంగీతం అభ్యసించారు. అప్పట్నుంచి ఆరంభమైన ఆయన గాన ప్రవాహం హిందీతో బాటు దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో సాగింది.
మహమ్మద్ రఫీ శాస్త్రీయ గీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, గజళ్ళు, ప్రణయ గీతాలు, విరహ గీతాలు, మెలోడి పాటలు, వేగం గల పాటలతో సహా వైవిధ్యభరితమైన పాటలెన్నో పాడారు.
మహాత్మాగాంధీ మరణం సమయంలో రఫీ పాడిన ' సునో సునో ఆయే దునియా వాలో బాపూజీ కి అమర్ కహాని ' పాట సంచలనం కలిగించింది. పండిట్ నెహ్రు చేత శభాష్ అనిపించింది.
రఫీ స్వరంలో వున్న మహత్తు ఎంతటిదంటే అప్పట్లో ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ తనను ఉరి తీసేముందు చివరి కోరికగా రఫీ పాడిన ' ఓ దునియా కె రఖ్ వాలే ' పాట వినాలనుందని కోరాడట.
అనేక అవార్డులు, రివార్డులు స్వంతం చేసుకున్న ఈ గాన గంధర్వుడితో తెలుగు చిత్ర పరిశ్రమ అనుబంధం గురించి చెప్పుకోవాలంటే నాగయ్య గారి ' భక్త రామదాసు ' చిత్రంలో రఫీ తెలుగులోరఫీ తొలిసారిగా పాడినా అవి కబీర్ కు పాడడం వలన హిందీ గీతాలనే పాడించారు.
అట్లూరి పుండరీకాక్షయ్య గారి ' భలే తమ్ముడు ' చిత్రం కోసం మొదటిసారిగా తెలుగు పాటలు పాడారు. ఆరోజుల్లో బొంబాయిలో ఆయన రోజుకు అయిదారు పాటలు పాడే పరిస్థితి. కానీ ఈచిత్రంలో ఆరు పాటలకోసం ఆరురోజులు కేటాయించారు. అలా ఎందుకంటే తెలుగు తనకు అసలు పరిచయంలేని భాష కనుక పాటను క్షుణ్ణంగా నేర్చుకుని, భావం వంటబట్టించుకోవడానికి కనీసం ఆమాత్రం సమయం అవసరమని ఆయన భావించారు. ఆయన బొంబాయి నుంచి మద్రాసులో విమానం దిగుతూనే రిహర్శల్స్ కు బయిల్దేరారు. దానికి ముందు ఆ చిత్ర కథానాయకుడు రామారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆ రోజు పుండరీకాక్షయ్య గారి ' శ్రీకృష్ణావతారం ' చూసారు. రామారావు గారి ఉ, ఆయన శ్రోతలు పలికే తీరు తెన్నులు, ఆయన శృతి వగైరాలు జాగ్రత్తగా పరిశీలించారు. ఆ తర్వాత పరిపూర్ణమైన రిహార్సల్స్ చేసి యుగళగీతాలతో సహా ఆ చిత్రంలోని ఆరు పాటల్ని పాడారు మహమ్మద్ రఫీ.
మధురమైన గళం మహమ్మద్ రఫీకి దేవుడిచ్చిన వరం
భారత శ్రోతలు ఎన్నటికీ మరచిపోలేని మధుర స్వరం.
రఫీకి గాలిపటాలంటే మక్కువ. ఎప్పుడు ఖాళీ దొరికినా గాలిపటాలెగర వెయ్యడానికి ఉత్సాహం చూపించేవారు. ఆయన మరణించడానికి ముందురోజు కూడా గాలిపటాలెగుర వేసారట.
గాన గంధర్వుడు మహమ్మద్ రఫీ వర్థంతి సందర్భంగా ఆయన తెలుగు చిత్రాల్లో పాడిన కొన్ని పాటల కదంబం........
Vol. No. 02 Pub. No. 297
2 comments:
ధన్యవాదాలు.
జ్యోతి గారూ !
మీక్కూడా ధన్యవాదాలు.
Post a Comment