Wednesday, July 20, 2011

నేనెప్పుడైనా నవ్వానా ?

 చార్లీచాప్లిన్ గొప్ప నటుడు, దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నిర్మాత...... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతే కాదు ఆయనకు చాలా సమయస్పూర్తి వుండేది. చాప్లిన్ కు మరో ప్రముఖ హాస్యనటుడు పీటర్ సెల్లర్స్ వీరాభిమాని.  తాను నటించిన ప్రతీ చిత్రాన్నీ విడుదలకు ముందే చాప్లిన్ కి చూపించడం ఆయన అలవాటుగా వుండేది.

అలాగే ఒకసారి చాప్లిన్ కోసం ఒక చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశాడు. దానికి పిలవడానికి చాప్లిన్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన హాయిగా తన్మయత్వంతో వైలెన్ వాయించుకుంటున్నాడు. అది చూసిన పీటర్ సెల్లర్స్ కు నవ్వు వచ్చింది. పకపకా నవ్వుతూ " మీరేమో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చలనచిత్ర ప్రముఖుడు. తీరా చూస్తే మీరు ఇలా వైలెన్ తో కుస్తీ పడుతున్నారు " అన్నాడు.

దానికి చాప్లిన్ " అందుకా అంతలా నవ్వుతున్నావు ? అయినా నువ్వు నటించిన హాస్య చిత్రాలు నాకెన్నో చూపించావు. అవి చూస్తున్నపుడు ఏనాడైనా నేనిలా నవ్వానా ? " అని చురక విసిరాడు.  

Vol. No. 02 Pub. No. 285

3 comments:

Rajendra Devarapalli said...

:) :)

ఆ.సౌమ్య said...

హహహహ :)))

SRRao said...

* రాజేంద్రకుమార్ గారూ !
* ఆ. సౌమ్య గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం