మనసు కవి.... 'మన ' సుకవి ఆచార్య ఆత్రేయ
చిన్న చిన్న పదాలు... పెద్ద పెద్ద అర్థాలు
పాటైనా... మాటైనా...పదాలతో చదరంగం
ఆడుకుంటుంది ఆయన సాహిత్యాంతరంగం
తెలుగు చిత్ర రంగానికి ఆయనొక సువర్ణాభరణం
తెలుగు చిత్రరంగంలో ఆయనదొక సువర్ణాథ్యాయం
విశ్వకవి రవీంద్రుని జన్మదినం రోజునే ఆత్రేయ జన్మించడం విశేషం. దానికాయన ' నేను కవి కావాలనే ఉద్దేశ్యంతో కావాలనే ఈరోజు పుట్టాను ' అనేవారు.
ఆత్రేయగారికి చిన్న వయసులోనే నాటకాలమీద ఆసక్తి కలిగింది. ఒకసారి ఆయన తను చదివిన ప్రాథమిక పాఠశాలలో ప్రదర్శించిన నాటకంలో వేషం వేశారు. ఆ సమయానికి ఆత్రేయ గారి అన్నగారు ఊర్లో లేరు. అసలే సనాతన సాంప్రదాయాలు, చాందస భావాలు గల కుటుంబం. ఆయన ఊర్నుంచి తిరిగి రాగానే విషయం తెలిసింది. అంతే ! ఆయన ఉగ్రనరసింహుడయ్యాడు. నాటకాల్లో వేషం వెయ్యడం ఒక తప్పైతే, దానికోసం మీసం తీసెయ్యడం మరో తప్పు. ఈ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఆత్రేయగారి చేత గోమూత్రం తాగించారు.
ఆత్రేయ ఓ సందర్భంలో మాట్లాడుతూ " ఒక సమాజం వారు ఏంటో అభిమానంతో ' అత్రేయగారూ ! మీకు మహాకవి, అభ్యుదయ కవి లాంటి బిరుదలక్కర్లేదు. మనసుకవి అని బిరుదు ఇవ్వదలిచాం ' అంటే మనసు మీద మనసు పెట్టిన కవిగా నన్నింతగా గుర్తించినందుకు ఆ బిరుదును త్యాగం చెయ్యగలను. ' మన ' సుకవి అంటే చాలు " అన్నారు.
ఆచార్య ఆత్రేయ గారి ఎనభైవ జన్మదినం సందర్భంగా ఆ ' మన ' సుకవి ని స్మరించుకుంటూ.......
ఆత్రేయ గారి మీద గత జన్మదినానికి రాసిన టపా, ఆయన పాటల జ్ఞాపకాల కదంబం -
ఆత్రేయ గారి ఛలోక్తి-
మంద భాగ్యుడు
Vol. No. 02 Pub. No. 227
No comments:
Post a Comment