అమ్మ అనేది ఒక కమ్మని భావన
అమ్మతనమనేది ఒక అద్భుతమైన వరం
అమ్మంటే అంతులేని పెన్నిధి
అంది వచ్చిన దేవత సన్నిధి
అమ్మ పలుకు మధురం
అమ్మ ప్రేమ మధురాతి మధురం
చిన్ననాటి నీ లాలి నన్ను నిదురపుచ్చగా
ఈనాటి నీ లాలి మేలుకొలుపు కాగా
అమ్మగా దీవించి కమ్మగా నిదురపో !
పలుకు తేనెల తల్లి పవళించవమ్మా !
***************************************
మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో................
గత సంవత్సరం టపా....
అమ్మ అన్నది కమ్మని మాట
Vol. No. 02 Pub. No. 229
2 comments:
Thanks for the greetings.
I think you resemble your mother.
madhuri.
మాధురి గారూ !
ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమేననుకుంటాను. చాలామంది అలాగే అంటూవుంటారు. ఆవిడ త్యాగాన్ని మాటల్లో చెప్పలేను.
Post a Comment