' అమ్మ ' అనేది ఒక కమ్మని మాట
అమ్మ అంటేనే కోటి వరహాల మూట
అమ్మంటేనే ఒక తీయని భావనన్నమాట
అమ్మంటే మనసున తేనెలూరు
అమ్మంటే ప్రేమకు మారుపేరు
అమ్మకెవరూ ఇలలో సాటి రారు

అమ్మను మించి దైవమున్నదా ?
అమ్మను కాదనే ధైర్యమున్నదా ?
అమ్మను లేదనే జాతి వున్నదా ?
అమ్మంటే కదిలే దేవత
అమ్మంటే కనిపించే దీపం
అమ్మంటే మన ప్రాణం

అమ్మ కన్న మిన్న అయిన కావ్యం ఎవరు రాయగలరు ?
అమ్మ కన్న మిన్న అయిన మాట ఎవరు చెప్పగలరు ?
అమ్మ కన్న మిన్న అయిన పాట ఎవరు నేర్పగలరు ?
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాభినందనలు
Vol. No. 01 Pub. No. 287
8 comments:
HAPPY MOTHER'S DAY
మాతృ దినోత్సవం శుభాభినందనలు మీక్కుడా...
మీకూ మాతృదినోత్షవ శుభాకాంక్షలు .
* లక్ష్మీ రాఘవ గారూ !
* సంతోష్ గారూ !
* మాలా కుమార్ గారూ !
ధన్యవాదాలు
అమ్మ గురించి ఎంత రాసినా తక్కువేనండి..thanks and wishes to all the mothers..!!
అమ్మ గురించి మీరిచ్చిన నిర్వచనాలు సామాన్యమైనవి కాదండి. చదువుతూ పోతూ ఉంటే మనసులో కలిగే అనందం వ్యక్తం చేయటానికి నాకు మాటలు సరిపోవటం లేదండి.
మాతృదినోత్షవ శుభాకాంక్షలు..కవితలు బాగున్నాయి!
* తృష్ణ గారూ !
* జయ గారూ !
* సృజన గారూ !
ధన్యవాదాలు
Post a Comment