Saturday, June 18, 2011

కొలువైతివా... రంగశాయి !

 ఆదిశేషుని పడగలనే శయ్యగా చేసుకుని ఠీవిగా పవళించిన ఆ నారాయణుని, ఆ శ్రీరంగశాయి వైభవాన్ని వీక్షించడానికి మూడులోకాల జనులకు ఒక్కొక్కరికి వేయి కన్నులున్నా సరిపోవేమో ? 
 ............దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యానికి మాళవిక, భాగవతుల వెంకట రామశర్మ చేసిన నాట్యం, గురువుగా గిరీష్ కర్నాడ్ అభినయం అద్భుతంగా మేళవించిన ఈ పాట.........

 కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !!
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి
కొలువైతివా... రంగశాయి !

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి
చిరునవ్వు విరజాజులేవోయి ! ఏవోయి !
కొలువైతివా... రంగశాయి !

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
పరచేటి ఎలదేటులేవోయి ఏవోయి
కొలువైతివా... రంగశాయి !

ఔరా.. ఔరౌరా ! ఔరా... ఔఔరా !!
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి        

జిలి బిలి  పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
ముజ్జగములు మోహంబున తిలకింపగ పులకింపగ
శ్రీ రంగ మందిర నవసుందరా పరా !      
                                                               // శ్రీ రంగ //
                                                              // శ్రీ రంగ //
 కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !!
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి
కొలువైతివా... రంగశాయి !!1





Vol. No. 02 Pub. No. 260

5 comments:

మురళి said...

రమేష్ నాయుడు సంగీతం, జానకి గాత్రం వెరసి ఈ పాటని చిరంజీవిని చేశాయండీ..

సమీర said...

habba....... inniroju chevulakupattina tuppu vadilindandi.eepatavintunte.
eepaatanu gurthu chesinanduku thanks.

Chowdary said...

ఈ పాటని వెంపటి చినసత్యం గారు నట్టువాంగం చేస్తుండగా విన్నాక ఇంకెవరి నోటైనా అంత బాగుండదు :)

శేషాహి బదులు శేషాయి అని పడింది; సరిచేయగలరు. అలాగే మోహంబున బదులు మొహంబున.

SRRao said...

* మురళి గారూ !
* సమీర గారూ !
ధన్యవాదాలు

* చౌదరి గారూ !
మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం. వెంపటి సత్యం గారిని మించిన వారు లేరనే చెప్పవచ్చు. కానీ ఎన్నో రకాల పుష్పాలు. దేని పరిమళం దానిదే కదా !
కొన్ని పొరబాట్లు సూచించినందుకు ధన్యవాదాలు. సరి చేస్తాను.

Narasimharaju said...

Nice song. Thanks for reminding. Bhagavthula Venkata Rama Sharma's son Sri Ram is my friend.Sri Shrma is running a dance school at Vijayawada i guess

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం